అమెరికాకు మ‌రో ఎదురుదెబ్బ. ఇరాక్‌లో కూలిన సైనిక విమానం

అమెరికాకు మ‌రో ఎదురుదెబ్బ. ఇరాక్‌లో కూలిన సైనిక విమానం

ఇరాన్ తో యుద్ద సమయంలో అమెరికా కు మరో దెబ్బ తగిలింది. యుద్ద విమానాలకు గగన తలంలో  ఇంధనం నింపే  కేసీ 135 యుద్ద విమానం కూలిపోయింది. ఆపరేషన్ ప్యూరీలో పాల్గొన్న రెండు కేసీ 135 యుద్ద విమానాల్లో ఒకటి కూలిపోయిందని,  మరొకటి సురక్షితంగా ల్యాండ్ అయిందని  అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) తెలిపింది.  అయితే ఆ విమానం ఎలా కూలిపోయిందనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో పొరపాటుగా కువైల్ వైమానిక దళం జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన మూడు F15 యుద్ద విమానాలు కూలిపోయిన విషయం తెలిసిందే.  

60 ఏళ్లకుపైగా సేవలందిస్తోంది కేసీ 135 యుద్ద విమానం. యుద్ద విమానాలకు గగన తలంలోనే ఫ్యుయెల్ నింపుతుంది.  ఇందులో ముగ్గురు సిబ్బంది ఉంటారు. పైలట్ కోపైలట్, విమానాలకు ఇంధనం నింపేందుకు బూమ్ ను నిర్వహించే మరో వ్యక్తి ఇందులో ఉంటారని యూఎస్ వైమానిక దళం తెలిపింది. 

ఫిబ్రవరి 28న యుద్దం ప్రారంభంలో  కువైట్ దళాలు పొరపాటున మూడు అమెరికన్ ఎఫ్ 15ఈ యుద్ద విమానాలను కూల్చివేశాయి. అయితే వాటిల్లో ఉన్న సిబ్బంది ఆరుగురు సురక్షితంగా తప్పించుకోగలిగారని సెంట్ కామ్ తెలిపింది.