తంగళ్లపల్లి మండలంలో తాడూర్ హైస్కూల్‌‌ కు పలువురు దాతలు విరాళాలు

తంగళ్లపల్లి మండలంలో  తాడూర్ హైస్కూల్‌‌ కు పలువురు దాతలు విరాళాలు

తంగళ్లపల్లి, వెలుగు: తంగళ్లపల్లి మండలం తాడూర్‌‌‌‌ హైస్కూల్‌‌కు పలువురు దాతలు విరాళాలు అందజేశారు. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో దాతలు ఈమేరకు విరాళాలు అందజేశారు. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిటైర్డ్ ఆఫీసర్ పుప్పాల వెంకటరమణారావు తన తండ్రి నరసింహారావు జ్ఞాపకార్థం స్కూల్‌‌లో కల్చరల్‌‌ ప్రోగ్రామ్స్‌‌ కోసం రూ.1.50 లక్షలతో స్టేజీని నిర్మించారు. దీంతోపాటు వెంకటరమణారావు, సురభి నవీన చొరవతో అర్బన్ బ్యాంక్ సిరిసిల్ల  సౌజన్యంతో ప్రైమరీ స్కూల్‌‌కు టీవీ అందజేశారు. 

స్కూల్‌‌ కాంపౌండ్ నిర్మాణానికి పుప్పాల జితేందర్‌‌‌‌రావు రూ.20 వేల నగదును అందజేశారు. పుప్పాల సందీప్ స్కూల్‌‌ లైబ్రరీకి అవసరమైన బుక్స్ అందిస్తానని హామీ ఇచ్చారు. గుడ్ల అరవింద, రవి టెన్త్‌‌లో స్కూల్ టాపర్‌‌ గా నిలిచిన స్టూడెంట్‌‌కు రూ.10 వేలు అందజేశారు. అలాగే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి  ముకుందం రూ.3వేలు అందజేశారు. టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ లో అల్పాహారం కోసం కొత్వాల్ వామన్ కుమార్, నగునూర్ శేఖర్‌‌‌‌ రూ.2 వేలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, ఉపసర్పంచ్ శ్రీధర్, పాలకవర్గ సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌‌‌‌పర్సన్లు రొడ్డ వాణి, రేవతి,హెచ్ఎంలు రవీందర్, శ్రీకాంత్, టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.