పోలీస్ SI భార్య దివ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్ : అంత్యక్రియల సమయంలో హై టెన్షన్

పోలీస్ SI భార్య దివ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్ : అంత్యక్రియల సమయంలో హై టెన్షన్

 కరీంనగర్ టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్.  స్వగ్రామంలో దివ్య అంత్యక్రియల సమయంలో హైటెన్షన్ నెలకొంది. దివ్య భర్త ఎస్ఐ చంద్రశేఖర్ పై  దాడి చేసేందుకు ఆమె బంధువులు ప్రయత్నించారు. 

 కడుపునొప్పితోనే తన కూతురు చనిపోయిందని ఇవాళ ఉదయం వన్ టౌన్ లో పోలీసులకు దివ్య తండ్రి  ఫిర్యాదు చేశాడు. అయితే పోస్టుమార్టం అనంతరం దివ్య  పుట్టిన స్వగ్రామమైన ఇల్లందకుంట మండలం సీతంపేటకు మృతదేహం తరలించారు.  ఈ క్రమంలోనే దివ్య భర్త ఎస్ఐ చంద్రశేఖర్, ఆయన సోదరుడు కూడా అంత్యక్రియలకు హాజరయేందుకు గ్రామానికి  వచ్చారు. అయితే తన అల్లుడిని ఎవరైనా కొడతారేమోనన్నా భయంతో ఓ గదిలోకి  పంపించాడు  దివ్య తండ్రి.దీంతో   ఓ గదిలోకి  వెళ్లి  గడియ పెట్టుకున్నాడు దివ్య భర్త చంద్రశేఖర్ . 
 
దివ్య  మృతదేహంపై  గాయాలు ఉన్నాయని ఆరోస్తూ  దివ్య బంధువులు ఆందోళనకు దిగారు.  భర్త చంద్ర శేఖర్ ను బయటికి రప్పించాలంటూ  పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు.  ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మొహరించడంతో ఇరు వర్గాల మధ్య  కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజుల నుండి భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని బంధువుల ఆరోపిస్తున్నారు. అయితే  మృతురాలు దివ్య  కడుపు నొప్పి భరించలేకనే ఆత్మ హత్య చేసుకుందంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. 

►ALSO READ | అదనపు కట్నం కోసమే..యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో భర్త అరెస్ట్

కరీంనగర్  వన్ టౌన్ పరిధి లోని హునుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న చంద్ర శేఖర్ భార్య దివ్య నిన్న తమ ఇంట్లో గన్నేరుపప్పు దంచి తిన్నడంతో ఆరోగ్యం విష మించింది. కరీంనగర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించా రు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగినట్లు మృతురాలి తండ్రి   వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి 2016లో వివాహం జరగ్గా.. ఇద్దరు కుమారులున్నారు.