జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ స్కూటీలో పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ముందు పార్క్ చేసినస్కూటీలోకి పాము చొరబడిందని గుర్తించిన యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. స్కూటీని స్టార్ట్ చేసే సమయంలో పాము అలజడి చేయడంతో ఆందోళనకు లోనై స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు.
ఇక రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. స్కూటీని జాగ్రత్తగా పరిశీలించి, లోపల దాక్కున్న పామును ఎలాంటి హాని జరగకుండా సురక్షితంగా బయటకు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయంలో తెలిసిన స్థానికులు స్కూటీలో పాము ఎలా చేరిందో చర్చించుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. వర్షాల కారణంగా పాముల సహజ ఆవాసాల్లో నీరు చేరడం, ఆహారం కోసం, సురక్షితమైన ఆశ్రయం కోసం అవి జవావాసాల్లోకి వస్తుంటాయి. వాహనాలు, ఇళ్ల పరిసరాల్లోకి మకాం వేస్తాయి. ఇలాంటి సమయాల్లో ప్రజలు , ముఖ్యంగా ఆడవికి దగ్గరగా ఉంటే ఇంటి ఓనర్లు జాగ్రత్తగా ఉండాని,బయట పార్క్ చేసిన బైకులను ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
