Prabhas Fauji : వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ విశ్వరూపం.. దసరా బరిలో 'ఫౌజీ' రెడీ!

Prabhas Fauji : వార్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ విశ్వరూపం.. దసరా బరిలో 'ఫౌజీ' రెడీ!

సీతారామం వంటి క్లాసిక్ హిట్ ను అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఫౌజీ'. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు.  ఇది ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి ( జనవరి 9, 2026 ) కానుక వచ్చిన రాజాసాబ్ 'బాక్సాఫీస్' వద్ద ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశపరిచింది. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ 'ఫౌజీ'పైనే ఉన్నాయి.

శరవేగంగా సూటింగ్..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం,' ఫౌజీ' సినిమా ఇప్పటి కే 70 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తనదైన శైలిలో ఎమోషన్స్ పండిస్తూనే, యుద్ద సెన్నివేశాలను విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ సెట్లను నిర్మించి కీలక సన్నివే శాలను చిత్రీకరిస్తున్నారు. 

దసరా రిలీజ్?

ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫౌజీ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా మేకర్స్ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2026 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా సీజన్ పెద్ద సినిమాల వసూళ్లకు కలిసొచ్చే సమయం కావడంతో, ఆ లోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

►ALSO READ | Tilak Varma- Ram Charan: పెద్ది మూవీ సెట్స్లో వరల్డ్ కప్ హీరో సందడి.. తిలక్ వర్మకి గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్

భారీ అంచనాలతో..

ఈ సినిమాతో ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అలాగే జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ఫౌజీ'  మూవీ తర్వాత ప్రభాస్  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్‌తో 'ఫౌజీ'ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.  ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీ భాషలో కూడా  ప్రేక్షకుల ముందుకు రానుంది.   ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్‌లో చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు.