Tilak Varma- Ram Charan: పెద్ది మూవీ సెట్స్లో వరల్డ్ కప్ హీరో సందడి.. తిలక్ వర్మకి గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్

Tilak Varma- Ram Charan: పెద్ది మూవీ సెట్స్లో వరల్డ్ కప్ హీరో సందడి.. తిలక్ వర్మకి గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్

Tilak Varma- Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. ఉప్పెన్ మూవీ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రైరై రారా” సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. 

తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో సందడి నెలకొంది. టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుతంగా ఆడిన భారత యువ క్రికెటర్, హైదరాబాద్ వాసి తిలక్ వర్మ పెద్ది షూటింగ్ సెట్స్ ని సందర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా సెట్ లో మెగా–పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తిలక్ వర్మ కాసేపుటో ముచ్చటించాడు. అంతేకాదు, రామ్ చరణ్, తిలక్ వర్మకు ప్రత్యేక గిఫ్ట్ అందజేశాడు. ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో ఉపయోగించిన ఓ బ్యాట్‌ను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. 

►ALSO READ | SRH Captain: ఇట్స్ అఫీషియల్.. ఎస్ఆర్‌హెచ్‌  కెప్టెన్‌గా ఇషాన్ కిషన్.. మరీ అభిషేక్ శర్మ!

కాగా వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనపై మెగా హీరో రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. తిలక్ వర్మ మూవీ సెట్స్ వెళ్లిన సందర్భంగా తీసిన వీడియోను ‘పెద్ది’ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఏప్రిల్ 30వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక తిలక్ వర్మ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు.