జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహం కీలకపాత్ర పోషిస్తుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం కేతు గ్రహం ప్రభావం చాలా లోతుగా ఉంటుందని పండితులు చెబుతారు. కేతువు శుభస్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో అనుకోని మార్పులు సానుకూలంగా మారతాయి. అదే సమయంలో అనుకూలత లేని స్థితిలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం కేతువు పూర్వఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్కడే మార్చి 29 వతేది వరకు ఉంటాడు. దీని ప్రభావం ఏరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . !
కేతు గ్రహ సంచారం వల్ల ఆర్థిక స్థితి, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య పరిస్థితులు, సామాజిక గుర్తింపు వంటి అంశాల్లో కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా మకర, వృషభ, సింహ , ధనస్సు రాశుల వారికి ఈ కాలం అనుకూలంగా ఉండనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేష రాశి: కేతువు నక్షత్ర మార్పు వలన ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఈ కాలంలో టీమ్ లీడర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కాపాడుకునేందుకు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా సానుకూలంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు చేకూరుతాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడంతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి కేతు గ్రహం నక్షత్ర మార్పు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండనుంది. . కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగి సామరప్య వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ రంగంలో ఉన్నవారికి ఈ కాలం లాభదాయంగా ఉండేఅవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మొండి బకాయిలు వసూలు కావడం...పెండింగ్ పనులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథునరాశి: ఈ రాశి వారికి కేతువు సంచారంలో మార్పుతో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.ప్రతి విషయం ఛాలెంజ్‌గా ఉంటుంది. వ్యాపారం కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులు అనవరంగా మాట పడతారు. అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు
కర్కాటకరాశి: కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అయితే ఆహార విషయంలో నియమాలు పాటించడం అవసరమని పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు.. బంధువులు మోసగించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి.
సింహ రాశి: ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అకస్మాత్తుగా లాభాలు వస్తాయి. ఎంతో కాలంగా అమ్ముడుకాని వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులకు పరిష్కారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. జాబ్ మారేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని ఆస్ట్రాలజిస్టుల అంచనా. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఖర్చులపై నియంత్రణ సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇంటి వాతావరణం ఆనందంగా మారి, కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశం లభిస్తుంది.
కన్యారాశి: కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ రాశి వారు చెడు వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మద్యం తాగి వాహనాలు నడపటం వంటి వాటికి దూరంగా ఉండండి. గొంతు సంబంధమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారంలో పెద్దగా మార్పులు లేకపోయినా.. అనారోగ్య విషయాలపై మిమ్మల్ని ఈ సమయంలో బాధించొచ్చు అని పండితులు సూచిస్తున్నారు..
తులారాశి: కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం వలన సుఖాలపై మరింత మోజు పెరుగుతుంది. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినొచ్చు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వల్ల భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నాయి. ఏది మంచి.. ఏది తప్పు అనే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.
వృశ్చికరాశి : కేతువు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వీరికి సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అలాగే కొంతమంది స్నేహితులతో కలిసి ఈ సమయంలో మంచి పనులు ప్రారంభిస్తారు. దీనివల్ల శుభవార్తలు కూడా వింటారు. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచిది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలొస్తాయి. ప్రేమ.. పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి కేతు గ్రహం నక్షత్రం మార్పు వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్ పనులపై స్పష్టమైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరిగి, మీ పనికి గుర్తింపు లభిస్తుంది. సామాజిక రంగాల్లో లేదా సేవా కార్యక్రమాల్లో ఉన్నవారికి ప్రత్యేక గుర్తింపు కలుగుతుంది.
మకరరాశి: ఈ రాశి వారికి కేతు గ్రహ సంచారం మంచి సంకేతాలను తీసుకువస్తోంది. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడులు ఈ దశలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. . ఉద్యోగంలో ఉన్నవారికి తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. . వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా లాభదాయక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారి, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభరాశి:ఈ రాశి వారిలో ఆత్మ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఏదైనా కొత్త కోర్సులు, కొత్త విషయాలను నేర్చుకోవాలి అనుకుంటే ఇది సరైన సమయం.. మంచి కాలం అని గుర్తుంచుకోండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలు అందరూ శ్రద్ధగా వింటారు. మీలోని అద్భుతమైన ప్రతిభ బయటకు వచ్చే సమయం ఆసన్నమైందని గ్రహాలు చెబుతున్నాయి. పెండింగ్ పనులు ఉన్నా ఈ కాలంలో పూర్తి చేయవచ్చు. కమ్యునికేషన్ రంగంలో ఉండే వాళ్లకు అద్బుత కాలమని పండితులు చెబుతున్నారు
మీనరాశి : కేతువు పూర్వఫల్గుణి నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు.కష్టపడి పూర్తి ప్రయోజనం పొందుతారు.ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.గౌరవం పెరుగుతుంది. ఓర్పు, ధైర్యంతో పెద్ద సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా కొనసాగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
