Ugadi 2026: కొత్త సంవత్సరం  పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.... విశేషాలు.. రహస్య సందేశాలు ఇవే..!

Ugadi 2026: కొత్త సంవత్సరం  పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి.... విశేషాలు.. రహస్య సందేశాలు ఇవే..!

తెలుగువారి నూతన సంవత్సరం మరో కొద్ది రోజుల్లో అంటే 2026 మార్చి 19న ప్రారంభం కానుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే కొత్త సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం.  జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  పరాభవం అంటే గర్వం.. అహంకారం.. స్వార్థం అని అర్దం.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాభవం అంటే ఏమిటి.. కొత్త సంవత్సరం  విశేషాలు.. రహస్యాలు ఏమిటి..  పండితులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

తెలుగు పంచాంగం ప్రకారం..  కొత్త సంవత్సరం.. పరాభవ నామ సంవత్సరం  మార్చి 19న ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరం గురించి ..  ఆధ్యాత్మికంగా  పరిశీలించినట్లైతే.. ఇలాంటి వ్యతిరేక లక్షణాలను  లక్షణాలను జయించి వినయం వైపు నడిపించే కాలాన్ని సూచిస్తుంది.  ప్రతి వ్యక్తి తన లోపాలను గుర్తించి..వాటిని అధిగమించడానికి ప్రయత్నించే సంవత్సరమని  పండితులు వివరిస్తున్నారు. పరాభవం అంటే ఏమిటి..

పురాణాల ప్రకారం  తెలుగు కాలచక్రంలో 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ చక్రంలో పరాభవ అనేది 40వ సంవత్సరం. సంస్కృతంలో ..పరాభవ.. అంటే  ఓటమి.. అపజయం .. అవమానం అనే అర్థాలు ఉన్నాయి.  కాని  జ్యోతిష్యనిపుణులు , ఆధ్యాత్మిక పండితుల విశ్లేషణ ప్రకారం .. పరాభవ నామ సంవత్సరానికి  లోతైన తాత్పర్యం ఉందని చెబుతున్నారు. కొత్త సంవత్సరం పేరులో ప్రతికూలత ఉన్నా కాని.. మనిషి జీవితంలో మార్పు, ఆత్మపరిశీలన, ఆత్మవికాసాన్ని సూచించేందుకు  ఒక సంకేతమని చెబుతున్నారు. 

అహంకారంపై విజయం :  కొత్త సవంత్సరం.. పరాభవ నామ సంవత్సరం పేరు ఆధారంగా స్వార్థం.. అహంకారం.. గర్వం.. మొదలగు చెడు లక్షణాలను వదలి.. మంచిగా.. అందరి మన్నలు పొందేలా ఈ తెలుగు సంవత్సరం ( పరాభవ) సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.ప్రతి వ్యక్తి తనలోని లోపాలను గుర్తించి.. వాటిని అధికమించేందుకు ఈ ఏడాది ప్రయత్నించే దశ అని పండితులు చెబుతున్నారు. 

జీవితంలో మార్పు .. 2026 మార్చి 19న ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరం పరాభవ నామ  సంవత్సరం.. ప్రతి  మనిషి తన గత అనుభవాలు... తప్పులు... విజయాల గురించి ఆలోచించి... వాటి నుంచి పాఠాలు నేర్చుకునే సమయంగా భావిస్తారు. ఇది వ్యక్తిత్వ వికాసానికి దారితీసే ఒక ఆత్మపరిశీలనా దశను సూచిస్తుంది.

 శత్రువులపై జయం: ప్రతి వ్యక్తికి కూడా కొంతమంది శత్రువులు ఉంటారు.  పలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పిన విధంగా అరిషడ్వర్గాలు.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు.. మనిషి ఎదుగుదలను అడ్డుకోవడం.. శత్రువులను పెంచే అంతర్గత శత్రువులు ఉంటారు.  పరాభవ నామ సంవత్సరంలో  ఇలాంటి  ఎనిమీస్​పై విజయం సాధించి.. ధర్మబద్దంగా జీవితం గడిపేందుకు ఒక సూచన అని పండితులు చెబుతున్నారు. 

 పరాభవ సంవత్సరం విశేషాలు...

తెలుగు పంచాంగ చక్రం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతుంది. గతంలో 1906–1907, 1966–1967 సంవత్సరాలు పరాభవ నామ సంవత్సరాలుగా వచ్చాయి. మళ్లీ  ఇప్పుడు 2026 మార్చి 19న ప్రారంభమయ్యే ఉగాది నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.

తెలుగు కాలచక్రంలోని 60 సంవత్సరాలను పండితులు  మూడు భాగాలుగా విభజిస్తారు. ఈ 60 సంవత్సరాలను  బ్రహ్మ, విష్ణు, శివ విభాగాలుగా చెప్పబడతాయి. ఈ విభాగాలలో పరాభవ సంవత్సరం విష్ణువుకు కేటాయించిన రెండవ విభాగంలో చివరి సంవత్సరమని పండితులు చెబుతున్నారు.

పరాభవం అంటే లోతైన విశ్లేషణ ఇదే..!

 కొత్త  సంవత్సరం పేరు వినడానికి ప్రతికూలంగా అనిపించినప్పటికీ.. పరాభవ అనే పదాన్ని  క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఓటమి కాదు..   అది మన లోపాలను గుర్తించి.. అలాంటి వాటిని  జయించే మార్గాన్ని సూచిస్తుందని  అంటున్నారు జ్యోతిష్య పండితులు .  ప్రతి మనిషిలో కూడా ఎంతో కొంత అహంకారం ఉంటుంది.  దానిని  తగ్గించి...ఆత్మపరిశీలన చేసుకొని.... సత్యంగా..ధర్మంగా ఉండి ముందుకు సాగాలని సూచించే ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సంవత్సరం ప్రతిబింబిస్తుందని  పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.