- విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు:- పేదల ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కొత్త బట్టలు అందజేశారు. అనంతరం అంబేద్కర్ సంఘంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నామన్నారు.
పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇండ్లతో నెరవేరుస్తున్నామని, ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
