వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ తొలి ఎడిషన్ కు రంగం సిద్ధమైంది. దిగ్గజాలు ఆడబోయే ఈ టోర్నీ సోమవారం (జనవరి 26) నుంచి ప్రారంభం కానుంది. మొత్తం పది రోజుల పాటు ఈ టోర్నీ సాగుతుంది. జనవరి 26 న మొదలు కానున్న వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఫిబ్రవరి 4 న ముగుస్తుంది. మొత్తం 18 మ్యాచ్ లు గోవాలోని 1919 స్పోర్ట్జ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. క్రిస్ గేల్ , శిఖర్ ధావన్ , దినేష్ కార్తీక్ , కీరాన్ పొలార్డ్, హర్భజన్ సింగ్, డేల్ స్టెయిన్, ఇయాన్ మోర్గాన్ వంటి మాజీ స్టార్ క్రికెటర్ ల ఆట చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మొత్తం ఆరు జట్లు ఈ లీగ్ లో ఆడతాయి. రాజస్థాన్ లయన్స్, ఢిల్లీ వారియర్స్, పూణే పాంథర్స్, దుబాయ్ రాయల్స్, గురుగ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. మొత్తం 90 మంది క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ లో ఉన్నవారే కావడం విశేషం. ఈ ఫార్మాట్‌లో ప్రతి జట్టు రాబిన్ రాబిన్ లెగ్ తరహాలో మ్యాచ్ లు ఆడుతుంది. ఒక జట్టు మరొక జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న నాలుగు జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఫిబ్రవరి 3 న సెమీ ఫైనల్ జరుగుతుంది. టైటిల్ పోరు ఫిబ్రవరి 4న జరగనుంది.
వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ 2026 స్క్వాడ్‌లు:
ఢిల్లీ వారియర్స్
చాడ్విక్ వాల్టన్, కోలిన్ ఇంగ్రామ్, గురుకీరత్ సింగ్ మాన్, శ్రీవత్స్ గోస్వామి (వికెట్ కీపర్), చిరాగ్ గాంధీ, రవి జంగీద్, హర్భజన్ సింగ్ (కెప్టెన్), ఇసురు ఉదానా, ఇర్ఫాన్ పఠాన్, ఇమ్రాన్ తాహిర్ , షాబాజ్ నదీమ్, సీక్కుగే ప్రసన్న, రాహుల్ శుక్లా, దివేష్ భతియా, దివేష్ భతియా
దుబాయ్ రాయల్స్
శిఖర్ ధావన్ (కెప్టెన్), గితాన్ష్ ఖేరా (వికెట్ కీపర్), ఫిడెల్ ఎడ్వర్డ్స్, అంబటి రాయుడు , యూసుఫ్ పఠాన్, సమిత్ పటేల్, అభిషేక్ రౌత్, కిర్క్ ఎడ్వర్డ్స్, దనుష్క గుణతిలక, పర్వేజ్ రసూల్, మోను కుమార్, పీటర్ ట్రెగో, అమిత్ వర్మ, పియూష్ మ్ఫూలా,
గురుగ్రామ్ థండర్స్
తిసార పెరీరా (కెప్టెన్), ఫిల్ మస్టర్డ్, రాస్ టేలర్ , ఛెతేశ్వర్ పుజారా , కొలిన్ డి గ్రాండ్‌హోమ్ , ఎస్ శ్రీశాంత్, స్టువర్ట్ బ్రాడ్, రాయద్ ఎమ్రిట్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అమిటోజ్ సింగ్, షెల్డన్ జాక్సన్, అక్షయ్ వఖారే, మలిందా పుష్పకుమార, పవన్ థాకర్, నెయిగి థాకర్
►ALSO READ | IND vs NZ: రోహిత్‌ను వెనక్కి నెట్టి సూర్య టాప్‌కు.. కెప్టెన్సీలో టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డ్
రాజస్థాన్ లయన్స్
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ కట్టింగ్, ఎల్టన్ చిగుంబురా, నమన్ ఓజా, కల్లమ్ ఫెర్గూసన్, ఏంజెలో పెరీరా, జెపి డుమిని , సురేష్ రైనా , బిపుల్ శర్మ, పినల్ షా, జైకిషన్ కోల్‌సవాలా, అభిమన్యు మిథున్, అనురీత్ సింగ్, జెసల్ కరియా, షాదాబ్ జకాటి
పూణే పాంథర్స్
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), సమీవుల్లా షిన్వారి, ఉపుల్ తరంగ , అమిత్ మిశ్రా, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రేవో , మార్టిన్ గప్టిల్ , రాబిన్ ఉతప్ప, కమిల్ లెవెరోక్, రాహుల్ యాదవ్, అసద్ పఠాన్, అంకిత్ రాజ్‌పూత్, ఫైజ్ ఫజల్, ప్రియాంక్ పాంచల్, ఇష్వర్ పాండే
మహారాష్ట్ర టైకూన్స్
దినేష్ కార్తీక్ (కెప్టెన్), కార్లోస్ బ్రాత్‌వైట్ , డేల్ స్టెయిన్, క్రిస్ గేల్, నాథన్ కౌల్టర్-నైల్ , స్టువర్ట్ బిన్నీ, పీటర్ సిడిల్, షాన్ మార్ష్ , రాహుల్ శర్మ , పవన్ సుయాల్, ప్రవీణ్ గుప్తా, బల్తేజ్ సింగ్, మన్విందర్ బిస్లా, సిద్దార్థ్ కౌల్
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ 2026 ఫ్యాన్‌కోడ్ లో అదేవిధంగా సోనీలైవ్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. డిడి స్పోర్ట్స్ లో కూడా లైవ్ చూడొచ్చు.
