రిపబ్లిక్ డే రోజు..అంబేద్కర్ ను అవమానించారు..కేంద్ర మంత్రిని నిలదీసిన ఫారెస్ట్ ఆఫీసర్

రిపబ్లిక్ డే రోజు..అంబేద్కర్ ను అవమానించారు..కేంద్ర మంత్రిని నిలదీసిన ఫారెస్ట్ ఆఫీసర్

రిపబ్లిక్​ డే రోజు రాజ్యాంగ నిర్మాతకు అవమానం.. స్వయంగా కేంద్రమంత్రి ఆయనను  విస్మరించడం.. రిపబ్లిక్​ వేడుకల్లో  ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రిని అడ్డుకొని మరీ నిలదీసిన మహిళా అధికారి.. నాసిక్​ పరేడ్​ గ్రౌండ్​ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో బాబా సాహెబ్​ అంబేద్కర్​ కు జరిగిన అవమానాన్ని ఫారెస్ట్ మహిళా అధికారిని ప్రశ్నించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

మహారాష్ట్రలోని నాసిక్​ పోలీస్ పరేడ్​ గ్రౌండ్​ లో సోమవారం (జనవరి 26) జరిగిన ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ఊహించని పరిణామం చోటు చేసుకుంది.  జెండా వందన జరిగిన కొద్ది సేపటికే ఋ ఘటన జరిగింది. ముఖ్య​అతిథిగా విచ్చేసిన   కేంద్ర మంత్రి గిరీష్ మహాజన్​ తన ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ పేరును ప్రస్తావించకపోవడంపై అక్కడే  ఉన్న ఫారెస్ట్​ డిపార్టుమెంట్ మహిళా పోలీస్​ అధికారిణి మాధురి జాదవ్​ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర మంత్రి ప్రసంగాన్ని అడ్డుకొని బాబా సాహెబ్​ అంబేద్కర్​ పేరును ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. 

కేంద్ర మంత్రి ప్రసంగిస్తుండగానే..సీటులోంచి లేచి స్టేజీ దగ్గరకు వెళ్లి మంత్రి ప్రశ్నించారు మాధురి జాదవ్.  దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.  మాధురి జాదవ్​ ను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయ్యింది. 

►ALSO READ | 77వ రిపబ్లిక్ డే సందర్భంగా.. భారత్ అంతరిక్ష విజయాలతో గూగుల్ డూడుల్

ఆ వీడియోలో..మాధురీ జాదవ్ తన నిరసను బలంగా వినిపించింది.అవసరమైతే తాను సస్పెన్షన్​ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని..కానీ మౌనంగా మాత్రం ఉండనని, సమానత్వం,న్యాయం పై రాజ్యంగ విలువలు బీఆర్​ అంబేద్కర్ రచనలుంచే వచ్చాయని.. గణతంత్ర దినోత్సవం రోజున ఆయన పేరును ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించినట్లు వినబడుతోంది. 

అయితే ఈ వివాదం పై స్పందించిన కేంద్ర మంత్రి గిరీష్​ మహాజన్​ వివరణ ఇచ్చారు. తాను బీఆర్​ అంబేద్కర్​పేరు ప్రస్తావించకపోవడం అనుకోకుండా జరిగిందని , ఉద్దేశపూర్వకంగా కాదని స్పష్టం చేశారు.