- చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్లో ఉద్రిక్తతలు, ప్రాణనష్టం, మౌలిక సౌలతుల విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేశారు.
"ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించడానికి ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడాను. జరుగుతున్న విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేశా. శాంతి, స్థిరత్వం పట్ల భారత్ నిబద్ధతను పెజెష్కియాన్ కు తెలియజేశాను. చర్చలు దౌత్య మార్గాలను అనుసరించాలని కోరాను. ఇరాన్లో భారత పౌరుల రక్షణ, భద్రతతో పాటు సరుకులు, ఇంధన రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటమే మా ప్రాధాన్యతలు" అని ట్వీట్ చేశారు.
