77వ రిపబ్లిక్ డే సందర్భంగా.. భారత్ అంతరిక్ష విజయాలతో గూగుల్ డూడుల్

77వ రిపబ్లిక్ డే సందర్భంగా.. భారత్ అంతరిక్ష విజయాలతో గూగుల్ డూడుల్

భారత దేశం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ..గ్లోబల్​సెర్చ్​ ఇంజిన్​గూగుల్​ ఓ ప్రత్యేక డూడుల్​ ను రూపొందించింది. భారత్​ అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ డూడుల్​ చిత్రాన్ని  రూపకల్పన చేసింది. ఈ చిత్రంలో గగన యాన్​, చంద్రయాన్​ వంటి మైల్​ స్టోన్స్​ ప్రతిబింబించేలా  అంతరిక్ష డిజైన్లను త్రివర్ణ రంగులతో GOOGLE అక్షరాలలో  ఇమిడ్చి ప్రదర్శించించింది. 

అంతరిక్ష సాంకేతికత, శాస్త్రీయ ప్రగతి అనే థీమ్​ తో GOOGLE అక్షరాలలోని ఓపెన్ స్పేస్​ లో రాకెట్లు, ఉపగ్రహాల కక్ష్యలు, అంతరిక్షనౌకల ఫొటోస్​,  జాతీయ జెండా రంగులతో కళాత్మకంగా రూపకల్పన చేసింది. ఈడూడుల్​ ను క్లిక్​ చేస్తే భారత దేశ గణతంత్ర దినోత్సవ చరిత్ర, ప్రత్యేకలను తెలిపి ప్రత్యేక పేజీని డిస్ ప్లే చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ డూడుల్​ ఆధునిక భారత దేశం టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడుతూ అంతరిక్ష పరిశోధనలలో సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబించేలా  ఆకర్షణీయంగా రూపొందించారు. 

గూగుల్​ ఇండియా  ఈ డూడుల్​ ను షేర్​ చేస్తూ Xలో  ఇలా రాసింది.‘‘ఈ గూగుల్​ డూడుల్​ తో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. కలలు కనడం, సాకారం చేసుకునేలా చేయాల్సిన కృషి, లక్ష్యాన్ని చేరుకోవడం, చంద్రయాన్​, ఆదిత్య ఎల్​1 నుంచి గగన్​ యాన్​ వరకు ఇస్రో అన్వేషన స్పూర్తి కనిపిస్తుందని క్యాప్షన్​ ఇచ్చింది.