ఆస్తి పన్ను చెల్లించని భవనాలు సీజ్

ఆస్తి పన్ను చెల్లించని భవనాలు సీజ్
  • నేటి నుంచి యాక్షన్ షురూ

హైదరాబాద్ సిటీ, వెలుగు: అధిక ఆస్తి పన్ను కట్టాల్సిన భవనాలను శనివారం నుంచి  సీజ్ చేయాలని జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్​అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు కార్పొరేషన్లలో రూ.3 వేల కోట్ల ఆస్తి పన్ను టార్గెట్ పెట్టుకోగా ఇప్పటి వరకు రూ. రూ. 2,170 కోట్లు మాత్రమే వసూల్ అయ్యాయి.

ఇంకా  17 రోజులు మాత్రమే ఉండగా, ఆ లోపు టార్గెట్​రీచ్ అయ్యేందుక మరో రూ.830 కోట్లను వసూలు చేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో మొండి బకాయిలున్న ఆస్తుల వివరాలను జోనల్ స్థాయిలో టాప్ 50, సర్కిల్ స్థాయిలో టాప్​30 గుర్తించి లిస్ట్​పంపాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.