పూనుగొండ్ల నుంచి మేడారానికి పగిడిద్దరాజు పయనం

పూనుగొండ్ల నుంచి మేడారానికి  పగిడిద్దరాజు పయనం

 పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజు బయల్దేరారు. డోలీలు, వాయిద్యాలతో శివసత్తులతో ఆయనను మేడారం గద్దెలకు వడ్డెలు తీసుకు వస్తున్నారు. శోభాయాత్రలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలో పగిడిద్దరాజుకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఇదిలా ఉండగా మేడారంలో గంట గంటకూ రద్దీ పెరుగుతోంది.

 రేపు సార లమ్మ గద్దెకు చేరనుంది. అదే సమయంలో పూ సుగొండ్లలో బయల్దేరిన పగిడిద్ద రాజు గద్దెపై కొలువుదీరుతారు. ఈ సందర్భంగా మంత్రిసీతక్క మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తుల కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. రేపటి నుంచి జరిగే మహ మేడారం కుంభ మేళాకు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఓపికగా మొక్కులు చెల్లించుకోవాలన్నారు.

 

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళా సమ్మక్క–సారలమ్మ జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28న సారలమ్మ రాక, 29న సమ్మక్క ఆగమనం, 30న గద్దెలపై ఇరువురు తల్లులకు మొక్కుల చెల్లింపు ఉంటాయి. 

అనంతరం 31న తల్లులిద్దరి వన ప్రవేశంతో మేడారం జాతర అధికారికంగా ముగుస్తుంది. ఈ సారి జాతరకు దాదాపు 2 కోట్లకు పైగా  భక్తులు తరలివచ్చే అవకాశం ఉందనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.