కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో గ్రామంలో కోతుల బెడద తీరుస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సర్పంచ్ దంపతులు నిలబెట్టుకున్నారు. గ్రామంలో గురువారం దాదాపు 200 కోతులను పట్టించి, అడవిలో వదిలిపెట్టారు. జట్టి నాగలక్ష్మి, సురేశ్ దంపతులు కోతుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో కోతుల సమస్య తీవ్రం కాగా.. వాటిని పట్టించి, అటవీ ప్రాంతానికి తరలించారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
