వెంకటాపూర్ (రామప్ప), వెలుగు ; ములుగు జిల్లా వెంకటాపూర్ మండల గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తి కోయల గిరిజన గూడాలైన తొర్రి చింతలపాడు, రోలు బండ లక్ష్మీ దేవి పేట ఉపకేంద్ర పరిధిలోని గిరిజన గూడాలకు వెంకటాపూర్ పీహెచ్సీ డాక్టర్. శ్రీకాంత్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది వెళ్లారు. పీహెచ్సీ నుంచి రెండు కిలోమీటర్లు ట్రాక్టర్ లో వెళ్లి, అక్కడి నుంచి మరో అర కిలోమీటర్ నడిచి గుత్తికోయగూడాలు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తురుచింతలపాడు, రోలుబండ, ఉట్ల గిరిజన గ్రామాల్లో వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు అనురాధ, స్వప్న , నవీన్ ఆరోగ్య కార్యకర్తలు స్వర్ణలత, వజ్ర, మోతిలాల్ , ఇరు ఉప కేంద్రాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
