T20 World Cup 2026: 19 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ: స్కాట్లాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో న్యూజిలాండ్ విధ్వంసకర వీరుడు

T20 World Cup 2026: 19 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ: స్కాట్లాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో న్యూజిలాండ్ విధ్వంసకర వీరుడు

టీ20 ప్రపంచకప్ 2026కు స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు సోమవారం (జనవరి 26) తమ జట్టుకు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్ గా రిచీ బెర్రింగ్టన్ ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో స్కాట్లాండ్ కు అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. 2007 తొలిసారి వరల్డ్ కప్ లో ఆడిన స్కాట్లాండ్ 19 ఏళ్ళ తర్వాత మరోసారి ఆడడానికి సిద్ధమైంది. అనుభవంతో పాటు కుర్రాళ్లతో నిండిన స్కాట్లాండ్ జట్టు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.  

బ్యాటింగ్ విభాగంలో జార్జ్ మున్సీ, రిచీ బెర్రింగ్టన్ వంటి పవర్‌ హిట్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఆల్ రౌండర్లుగా క్రిస్ గ్రీవ్స్, బ్రాండన్ మెక్‌ముల్లెన్ జట్టుకు బలంగా నిలవనున్నారు. బౌలింగ్ విభాగంలో మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్‌లపై టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. అఫ్గానిస్తాన్‌లో జన్మించిన ఫాస్ట్ బౌలర్ జైనుల్లా ఇహ్సాన్ తొలిసారి స్కాట్లాండ్ జట్టుకు ఎంపిక కావడం విశేషం. అలాగే న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ బ్రూస్ కూడా ఈ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. రిజర్వ్ ఆటగాళ్లుగా జాస్పర్ డేవిడ్‌సన్, జాక్ జార్విస్‌లను ఎంపిక చేశారు. 

ఎవరీ టామ్ బ్రూస్:
 
బ్రూస్ న్యూజిలాండ్ తరపున 17 టీ20 మ్యాచ్ లు ఆడి పెద్దగా రాణించలేకపోయాడు. 18.6 యావరేజ్.. 122.36 స్ట్రైక్ రేట్‌తో 279 పరుగులు మాత్రమే చేసి జట్టులో పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరిసారిగా ఫిబ్రవరి 2020లో టీమిండియాతో అంతర్జాతీయ క్రికెట్ ,మ్యాచ్ ఆడాడు. ఐదు సంవత్సరాల తర్వాత స్కాట్లాండ్ జట్టుకు ఆడుతున్నట్టు తన నిర్ణయాన్ని తెలిపాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ 2014 నుండి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఇటీవల బ్రూస్ గయానాలోని ప్రావిడెన్స్‌లో జరిగిన గ్లోబల్ సూపర్ లీగ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. స్కాట్లాండ్ లోని ఎడిన్‌బర్గ్‌లో జన్మించిన బ్రూస్.. 2016లో న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు  స్కాట్లాండ్ డెవలప్‌మెంట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

వరల్డ్ కప్ 2026కు స్కాట్లాండ్ స్క్వాడ్:

రిచీ బెర్రింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ కరీ, ఒలివర్ డేవిడ్‌సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్క్, ఫిన్లే మెక్రెత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సీ, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.

రిజర్వ్ ఆటగాళ్లు:

జాస్పర్ డేవిడ్‌సన్, జాక్ జార్విస్. 

నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు:

మాకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్‌.

టీ20 వరల్డ్‌కప్‌లో స్కాట్లాండ్ గ్రూప్ 'సి'లో ఉంది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో ఆడనుంది.