Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కలెక్షన్ల వేట.. 15 రోజుల్లో ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే?

Chiranjeevi : బాక్సాఫీస్ వద్ద ‘మన శంకర వర ప్రసాద్ గారు’ కలెక్షన్ల వేట.. 15 రోజుల్లో ఎన్ని వందల కోట్లు రాబట్టిందంటే?

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఈ చిత్రం విడుదలై 15 రోజులు దాటినా సినీ ప్రియులు  థియేటర్లకు క్యూ కడుతున్నారు.  లేటెస్గ్ గా ఈ మూవీ 15 రోజుల వసూళ్లను మేకర్స్ ప్రకటించారు.

బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ..

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ గ్రేస్ తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా వసూళ్లు చెబుతున్నాయి. కేవలం 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 358 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం రీజనల్ సినిమాగాతెలుగు చిత్ర పరిశ్రమలో 'బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్'గా అవతరించింది. సంక్రాంతి సీజన్‌లో గతంలో ఉన్న రికార్డులన్నీ ఈ 'శంకర ప్రసాద్' సునామీలో కొట్టుకుపోయాయి.

 

ప్లస్ పాయింట్ ఇదే..

ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరుకు దగ్గరగా ఉండే ‘శంకర వర ప్రసాద్’ పాత్రలో నటించడం మెగా అభిమానులకు ఐఫీస్ట్ లా అనిపించింది. అనిల్ రావిపూడి తనదైన కామెడీ టైమింగ్, ఎమోషనల్ డ్రామాతో మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో ప్రజెంట్ చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవి సరసన హుందాతనంతో కూడిన పాత్రలో ఒదిగిపోయారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయ్యింది. చిరు, వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు పండుగగా మారింది.  ఈ చిత్రానికి భీమ్స్ అందించిన పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను హోరెత్తించాయి. మాస్ సాంగ్స్ ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. షైన్ స్క్రీన్స్ ,  గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండ్‌గా కనిపించాయి.

సంక్రాంతి విన్నర్ - మెగాస్టార్!

ఒకప్పుడు 'ఇంద్ర', 'ఠాగూర్' సినిమాలతో ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారో, ఇప్పుడు 'మన శంకర వర ప్రసాద్ గారు' తో చిరంజీవి అదే మేజిక్ రిపీట్ చేశారు. విమర్శకులు సైతం అనిల్ రావిపూడి టేకింగ్‌ను, చిరంజీవి ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. 15 రోజులు పూర్తయినా కూడా వీకెండ్స్ లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద తన స్థానం ఎప్పుడూ పదిలమని మెగాస్టార్ మరోసారి చాటి చెప్పారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా 400 కోట్ల మార్కును కూడా సునాయాసంగా దాటేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.