బీఆర్ఎస్ భవన్ లో నాటకాలకు కర్త, కర్మ, క్రియ హరీశ్ రావు, కేటీఆర్ అని తెలంగాణ ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్ట సాయి కుమార్ అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. నిన్న బీఆర్ఎస్ భవన్ ప్రదర్శించిన నాటకాలపై ఆయన ఫైర్ అయ్యారు. నాటకాల ప్రదర్శనకు రవీంద్ర భారతిలో డేట్ లు ఫుల్ అయితే తెలంగాణ భవన్ కి పోవచ్చు అని అన్నారు. తెలంగాణ భవన్ లో 3 గంటల పాటు బీఆర్ ఎస్ నేతలు రేవంత్ రెడ్డి పేరు స్మరించి పునీతులు అయ్యారు.
వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ భవన్ లో నాటకాలే వెయ్యాలని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బహిష్కరణ రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు మర్చిపోయారని అన్నారు. తెలంగాణ ప్రజల గోసని పదేళ్లు బీఆర్ఎస్ పట్టించుకోలేదు. రాజ్యాంగం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడం హాస్యాస్పదం అన్నారు. 2034 వరకూ బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి నామస్మరణ చెయ్యాలి అప్పుడే మీ పాపాలు పోతాయని ఆయన విమర్శించారు.
