T20 World Cup 2026: లూయిస్, జోసెఫ్‌లపై వేటు.. వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

T20 World Cup 2026: లూయిస్, జోసెఫ్‌లపై వేటు.. వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు వెస్టిండీస్ జట్టు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను సోమవారం (జనవరి 26) ప్రకటించింది. షై హోప్ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. 15 మంది సభ్యుల జట్టులో హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ క్వెంటిన్ సాంప్సన్‌ను చేర్చుకుంది. మాజీ కెప్టెన్లు జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం షమర్ జోసెఫ్ కు స్క్వాడ్ లో స్థానం దక్కింది. 

జోసెఫ్‌తో పాటు పేస్ అటాక్‌లో హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్ ఉన్నారు. స్పిన్ విభాగానికి అకేల్ హోసేన్ నాయకత్వం వహిస్తాడు. రోస్టన్ చేజ్, గుడకేష్ రూపంలో మరో ఇద్దరు స్పిన్నర్లను జట్టులోకి ఎంపిక చేశారు.  ఓపెనర్ ఎవిన్ లూయిస్ తో పాటు ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్‌లపై వేటు పడింది. రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్ రూపంలో జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. 
రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన విండీస్ జట్టు వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీలతో పాటు గ్రూప్ సిలో ఉంది. ఫిబ్రవరి 7న స్కాట్లాండ్‌తో వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్ ఆడనున్నారు. 

2026 టీ20 వరల్డ్ కప్ కు వెస్టిండీస్ జట్టు:
 
షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, జాన్సన్ చార్లెస్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, క్వెంటిన్ సాంప్సన్, అకేల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, మాథ్యూ ఫోర్డే.

ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్: 

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు నెల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీమిండియాతో పాటు దాదాపు అన్ని జట్లు వరల్డ్ కప్ కు తమ స్క్వాడ్ ను ప్రకటించేశాయి. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి 20 జట్లు పోటీ పడుతుండడంతో ఈ మెగా టోర్నీకి భారీ హైప్ నెలకొంది.