సికింద్రాబాద్ పరిధిలోని జింఖానా గ్రౌండ్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (మార్చి 20) సాయంత్రం జింఖానా గ్రౌండ్లో ఓ మహిళ కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా అదుపుతప్పి రాయికి ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మహిళా కారు నుంచి దూకి ప్రాణాలు కాపాడుతుంది.
గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కారులో మంటలు వేగంగా వ్యాపించి చూస్తుండగా క్షణాల్లోనే కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
