IPL Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ మరో వారం రోజుల్లో పారంభం కానుంది. మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఐపీఎల్ లీగ్ ద్వారా అనేక మంది ప్లేయర్స్ అంతర్జాతీయ స్థాయిలో తమకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటారు. ఇకపోతే ఈ టోర్నమెంట్ హీస్టరీలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడికి "ఆరెంజ్ క్యాప్” దక్కుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ లాంటి స్టార్ బ్యాటర్లు భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఈ అవార్డును అత్యధికసార్లు గెలిచిన ప్లేయర్ మాత్రం ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్.
కాగా 2016లో విరాట్ కోహ్లీ 973 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ వరకు ఎవరూ కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. అలాగే, డేవిడ్ వార్నర్ అత్యధికంగా మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. దీంతో త్వరలోనే ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఆరెంజ్ క్యాప్ రేసులో టీ20 వరల్డ్ కప్ లో చెలరేగిన ఇషాన్ కిసన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ బరిలో ఉన్నారు. చూడాలి మరీ 2026 ఆరెంజ్ క్యాప్ ఎవరినీ వరిస్తోందో అనేది.
ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ప్లేయర్స్:
2008లో షాన్ మార్ష్ (616 పరుగులు)
2009లో మాథ్యూ హెడెన్ (572 పరుగులు)
2010లో సచిన్ టెండూల్కర్ (618 పరుగులు)
2011లో క్రీస్ గేల్ (608 పరుగులు)
2012లో క్రిస్ గేల్ (733 పరుగులు)
2013లో మైఖేల్ హస్సి (733 పరుగులు)
2014లో రాబిన్ ఉతప్ప (660 పరుగులు)
2015లో డేవిడ్ వార్నర్ (562 పరుగులు)
2016లో విరాట్ కోహ్లీ (973 పరుగులు)
2017లో మళ్లీ డేవిడ్ వార్నర్ (641 పరుగులు)
2018లో కేన్ విలియమ్‌సన్ (735 పరుగులు)
2019లో మరోసారి వార్నర్ (692 పరుగులు)
2020: కేఎల్ రాహుల్ (670 పరుగులు)
2021: రుతురాజ్ గైక్వాడ్ (635 పరుగులు)
2022: జోస్ బట్లర్ (863 పరుగులు)
2023: శుభ్‌మన్ గిల్ (890 పరుగులు)
2024: విరాట్ కోహ్లీ (741 పరుగులు)
2025: సాయి సుదర్శన్ (759 పరుగులు)
