- రేషన్ కార్డు ఉన్నవాళ్లకే.. ఇందిరమ్మ బీమా:
- ఈ ఏడాది నుంచే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సింగిల్ సిస్టం
- గృహ నిర్బంధంలో కేసీఆర్.. బంధించింది కేటీఆర్, హరీశ్
- కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు
- బీఆర్ఎస్ ను తొక్కుకుంటూ మళ్లీ అధికారంలోకి వస్త
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కోసం శుక్లాను కలుస్తా
- బీఆర్ఎస్ హయాంలో ఆరు వేల ఫోన్లు ట్యాప్
- ఏ1 ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నం
- చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం (మార్చి 20) మండలిలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామన్నసీఎం ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సింగిల్ సిస్టం ఉంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆరువేల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వం ప్రాసెస్ ప్రకారం ముందుకు వెళుతోందని అన్నారు.చట్ట ప్రకారం విచారణ పూర్తికాకుండా అరెస్టు చేయలేమని అన్నారు. ప్రస్తుతం కేంద్రం విచారణకు అనుమతించిందని, కేసులో ఏ1గా ఉన్నప్రభాకర్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్టుచెప్పారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులోసీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను సస్పెండ్ చేశామని సీఎం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఆ పార్టీ నేతలు క్లీన్ చిట్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారని చెప్పారు. పంజాగుట్ట ప్రైవేట్ కేసు వ్యవహారంలో హరీష్ కు క్లీన్ చిట్ వచ్చిం దని సీఎం అన్నారు. దానిని హరీశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి ఫోన్ ట్యాప్ జరిగిందని సీఎం చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరిన సిద్ధమ ని చెప్పారు. గత ప్రభుత్వ అప్పులకు 3 లక్షల 30 వేల కోట్లు పడ్డీ కడుతున్నట్టు సీఎం చెప్పారు. ఇది సంక్షేమ బడ్జెట్ అని, 17 వేల కోట్ల రూపాయల ను వెల్ఫేర్ కు వాడామని సీఎం చెప్పారు.
కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తెలుసు
రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో తనకు తెలుసునని సీఎం రేవంత్ అన్నారు. కేబినెట్ విస్తరణ పై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తామని చెప్పారు. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని అన్నారు. నది కి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో గాంధీ మనవడు బీఆర్ఎస్ లో పడి ప్రకటన చేసి ఉంటారని అన్నారు. తన లెక్క ఎప్పుడు తప్పలేదు,మళ్ళీ అధికారం తమదేనని సీఎం అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ల కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ గవర్నర్ కే నిర్ణయాధికారం ఇచ్చిందని, ఈ విషయంలో గవర్నర్ తో మాట్లాడుతామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చినా హాజరవుతానని రేవంత్ అన్నారు.
గృహ నిర్బంధంలో కేసీఆర్
కేసీఆర్ ను కేటీఆర్, హరీశ్ రావు గృహ నిర్బంధం చేశారని, ఆయనను సభకు రానీయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ జాతిపిత అని వాళ్ల జాతి భావిస్తుందన్నారు. తెలంగాణ సమాజం జాతిపిత ఎవరనేది నిర్ణయించుకుంటుందని చెప్పారు. జనాభా లెక్కలు హైదరాబాద్ విభజన కు అడ్డంకి కాదని సీఎం అన్నారు. తాను బీఆర్ఎస్ ను తొక్కుకుంటూ మళ్ళీ అధికారంలోకి వస్తా అంటే.. బీఆర్ఎస్ కంటే బండి సంజయ్ ఎక్కువ స్పందించారని అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్టు కేటీఆర్ హరీశ్ రావును నమ్ముతున్నారని అన్నారు. జీవన్ రెడ్డి వ్యవహారం పీసీసీ చీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి చూసుకుంటారని చెప్పారు.
