ఆడవాళ్లకు జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటేనే అందంచందం. అమ్మాయిల వాలు జాడపై ఎన్నో పాటలున్నాయి. నాలుగైదు అడుగుల పొడవు ఉంటేనే ఆ అమ్మాయి జుట్టు చాలా పొడవుగా ఉందని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతుంటారు. అలాంటిది.. ఏకంగా 8 అడుగుల 10 అంగుళాల పొడవు వరకూ జుట్టు పెంచి కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. ఏదో మాటవరసకు అనడం లేదు. ఈ మహిళ తన పొడవైన జట్టు కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
Renu Dhariyal (India) has the longest hair in the world! 🩷
— Guinness World Records (@GWR) August 7, 2026
She has claimed the record for longest hair on a living person (female).
Her stunning raven tresses measure an unbelievable 271.50 cm (8 ft 10 in) long. pic.twitter.com/N8FeWdUGP0
ఉత్తరాఖండ్ కు చెందిన రేణు ధరియాల్ ఈ అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. తన జుట్టును 271.50 సెంటీమీటర్ల (8 అడుగుల 10 అంగుళాలు) పొడవు వరకూ పెంచింది. ఏళ్ల తరబడి ఓపికగా, జుట్టును పదిలంగా చూసుకుంటేనే ఈ ఘనత సాధ్యమైంది. ఆమె అంకిత భావం, పట్టుదలనే గిన్నిస్ వరల్డ్ రికార్డు వరకూ ఆమెను తీసుకెళ్లాయి.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నివేదిక ప్రకారం.. మహిళల్లో అత్యంత పొడవైన జుట్టు కలిగిన వ్యక్తిగా రేణు ధరియాల్ రికార్డు సృష్టించారు. ఏప్రిల్ నెలలో హల్ద్వానీలో ఆమె రికార్డు స్థాయి జుట్టును కొలిచి, ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ధృవీకరించారు. అయితే.. అప్పటివరకూ అత్యంత పొడవైన జుట్టు (272 సెం.మీ.) ఉన్న వ్యక్తిగా రాబర్ట్ వాడ్లో నిలిచారు. ధరియాల్ జుట్టు పొడవు కొద్దిగా తక్కువగా ఉండేది. అయితే.. ఎలాగైనా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకోవాలని.. ధరియల్ 2015 నుంచి జుట్టును పెంచుతూనే ఉంది.
సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ.. ఆమె జుట్టు నడుస్తుంటే నేలకు తాకేంత పొడవుగా పెరిగింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమె ఫొటోలను ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. ధరియాల్ సాధించిన ఘనత వల్ల ఆమె ఉక్రేనియన్ రికార్డ్ హోల్డర్ అలియా నాసిరోవా నుంచి టైటిల్‌ను కూడా దక్కించుకుంది. ధరియల్ ఇంట్లోనే తల నూనెలు, షాంపూలు తయారు చేసి, జుట్టు సంరక్షణ పట్ల తన విధానాన్ని ఆన్‌లైన్‌లో తన ఫాలోవర్లతో పంచుకున్నారు.
