RCB: ఆర్సీబీ మ్యాచ్ టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలి?

RCB: ఆర్సీబీ మ్యాచ్ టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలి?

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​) 2026 సందడి స్టార్ట్ అయింది. గత సీజన్‌లో తొలిసారి టైటిల్‌ను గెలుచుకుని, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. తమ హోమ్ మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల విక్రయానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. టిక్కెట్ల అమ్మకాలు ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ, ఫ్యాన్స్ ముందస్తుగా రెడీ అయ్యేందుకు అవసరమైన స్టెప్- బై- స్టెప్ ప్రాసెస్, రూల్స్ ని ఫ్రాంచైజీ వివరించింది.

ఈ ఐపీఎల్​లో ఆర్సీబీ టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను ఈజీగా చేసేందుకు, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తన అధికారిక అకౌంట్స్  ద్వారా కొన్ని కీలక సూచనలను జారీ చేసింది. కేవలం గుర్తింపు పొందిన, అధికారిక ఛానెళ్ల ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాలని అభిమానులకి తెఇపింది. నకిలీ వెబ్‌సైట్లు, మోసపూరిత వనరులు, స్కామ్‌ల పట్ల అలర్టుడగా ఉండాలని, అమ్మకాలు ప్రారంభమయ్యాక కేవలం అధికారిక సైట్ల ద్వారానే కొనుగోలు చేయాలని హెచ్చరించింది.  

ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సౌకర్యాలు: 
* ఫ్రీ మెట్రో జర్నీ: టిక్కెట్ కలిగిన వారు మ్యాచ్ రోజున బెంగళూరులోని మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుంది.
* పార్కింగ్ అండ్ షటిల్ సర్వీసులు: మ్యాచ్ టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడే, అభిమానులు పరిమితంగా ఉండే పార్కింగ్ స్లాట్‌లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేడియం సమీపంలో పిక్-అప్, డ్రాప్ సౌకర్యం కోసం షటిల్ సర్వీసులు కూడా అందుబాటులోకి తెచ్చారు.
* క్రౌడ్ మేనేజ్‌మెంట్: స్టేడియంలోకి ప్రవేశించేటప్పుడు రద్దీని నివారించడానికి, టిక్కెట్‌పై పేర్కొన్న గేట్ల ద్వారానే రావాలని సూచనలు చేసింది. కేవలం కబ్బన్ రోడ్, లింక్ రోడ్ ద్వారానే ప్రేక్షకులకు ప్రవేశం ఉంటుంది.

టిక్కెట్ బుకింగ్ విధానం: 
ఆర్సీబీ ప్రీ–-బుకింగ్ గైడ్‌లైన్స్ ని విడుదల చేసినప్పటికీ, టిక్కెట్ విక్రయాలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. దీని కోసం ఫ్రాంచైజీ, బీసీసీఐ ఇచ్చే అధికారిక అప్‌డేట్స్ కోసం అభిమానులు వేచి చూడాలని కోరింది. టిక్కెట్ అమ్మకాలు మొదలైన తర్వాత.. ఆర్సీబీ అధికారిక వెబ్‌సైట్, బుక్‌మైషో, జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ సదుపాయాలు సైతం ఉంటాయని పేర్కొనింది. 

ఆన్‌లైన్ బుకింగ్:
బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్ లేదా ఆర్సీబీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మ్యాచ్ ని సెలక్ట్ చేసుకుని, సీటింగ్ క్యాటగిరీ ఎంపిక చేసుకుని, UPI/కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. టిక్కెట్లు ఈ–మెయిల్ లేదా SMS ద్వారా వస్తుంది.  

ఆఫ్‌లైన్ బుకింగ్:
స్టేడియం కౌంటర్లు, గుర్తింపు పొందిన రిటైల్ అవుట్‌లెట్లలో టిక్కెట్లను విక్రయిస్తారు. నగదు లేదా కార్డు ద్వారా చెల్లించి టిక్కెట్లు పొందవచ్చు. ఫోటో ఐడీ తప్పనిసరి. టికెట్ ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సాధారణ స్టాండ్స్ నుంచి ప్రీమియం బాక్సుల వరకు వివిధ ధరల్లో టిక్కెట్లు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. కాగా, ఈ సీజన్‌లో బెంగళూరులో ఐదు హోమ్ మ్యాచ్‌లు, అలాగే సీజన్ చివరిలో రాయ్‌పూర్‌లో కూడా కొన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. టిక్కెట్ల విక్రయం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, స్టేడియంలో కూర్చుని తమ అభిమాన జట్టును ఉత్సాహపరచాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ మార్గదర్శకాలు ఎంతో కీలకం.