Sai Sudharsan Injury: శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత జట్టును గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కాగా, ఇప్పుడు యంగ్ క్రికెటర్ సాయి సుదర్శన్ కూడా గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజుల ముందే టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఈ ఊహించని షాక్ తగిలింది. 24 ఏళ్ల సాయి సుదర్శన్ తన కాలి వేలి గాయం (Toe Injury) నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence) లో శ్రమించాడు. కానీ సిరీస్ సమయానికి కోలుకుంటాడనే ఆశతో బీసీసీఐ సెలెక్టర్లు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, గాయం తగ్గకపోవడంతో ఈ సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ALSO READ : దూబేని వదిలేస్తే మాన్స్టర్ అయితడు..
బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీ:
గాయపడిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. 2025-26 రంజీ ట్రోఫీ సీజన్‌లో 60 వికెట్లు పడగొట్టిన ఆకిబ్, జమ్మూ కాశ్మీర్ చారిత్రాత్మక విజయంలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఇక గత జూన్, జులైలలో గాలే వేదికగా జరిగిన ఇండియా 'ఎ' శ్రీలంక పర్యటనలోనూ నబీ 6 వికెట్లతో చెలరేగాడు.
నంబర్-3 రేసులో దేవ్ దత్ పడిక్కల్:
సాయి సుదర్శన్ రీప్లేస్‌మెంట్‌ను బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ దేవదత్ పడిక్కల్‌ను నంబర్-3 స్థానంలో బరిలోకి దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మెయిన్ స్క్వాడ్‌లో ఉన్న పడిక్కల్, కొలంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన 3-రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 43.18 సగటు ఉన్న పడిక్కల్ , ఇప్పటి వరకు ఆడిన 3 టెస్టు ఇన్నింగ్స్‌లలో 90 పరుగులు చేశాడు.
