థర్డ్ అంపైర్ లేడు.. నిద్రమత్తులో అంపైర్: భారత్ vs జపాన్ మ్యాచ్‌లో గొడవ.. అసలేం జరిగింది?

థర్డ్ అంపైర్ లేడు.. నిద్రమత్తులో అంపైర్: భారత్ vs జపాన్ మ్యాచ్‌లో గొడవ.. అసలేం జరిగింది?

IND vs Japan Controversy: జపాన్‌లోని సానో వేదికగా భారత్ వర్సెస్ జపాన్ జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక ఏకైక టీ20 మ్యాచ్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ హిట్ (Direct Hit) చేసినప్పటికీ.. మైదానంలో మూడో అంపైర్ (Third Umpire) లేకపోవడంతో భారత్‌కు రన్ అవుట్ వికెట్ దక్కలేదు. సరికదా, జపాన్ బ్యాటర్లు ఓవర్‌త్రో రూపంలో రెండో పరుగును కూడా పూర్తి చేసుకుని మైదానంలో అందరినీ షాక్‌కు గురి చేశారు.

అయ్యర్ డైరెక్ట్ హిట్.. నిద్రమత్తులో అంపైర్: 

రెండో ఇన్నింగ్స్ సమయంలో భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన బంతిని జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ కవర్స్ దిశగా పుష్ చేసి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శ్రేయస్ మెరుపు వేగంతో బంతిని అందుకుని బౌలర్ ఎండ్‌లోని వికెట్లను నేరుగా తాకేలా డైరెక్ట్ హిట్ కొట్టాడు. ఆ సమయంలో బంతి వికెట్లకు తగిలే సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ దృష్టి వికెట్ల వైపు లేదు. దీంతో బ్యాటర్ ఔట్ అయ్యాడో లేదో ఖచ్చితంగా నిర్ణయించలేక అంపైర్ చూస్తూ ఉండిపోయాడు. భారత ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేస్తుండగానే, జపాన్ బ్యాటర్లు తెలివిగా ఓవర్‌త్రో రూపంలో రెండో పరుగును కూడా కంప్లీట్ చేసుకున్నారు. 

టీవీ అంపైర్ ఎందుకు లేడు: 

ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ (TV Umpire) వ్యవస్థ అందుబాటులో లేకపోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్ కోసం కేవలం ఇద్దరు ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్ (Chris Brown), క్రిస్ థర్గేట్ (Chris Thurgate)లతో పాటు మ్యాచ్ రెఫరీగా వేంగలిల్ నారాయణన్ కుట్టిని మాత్రమే నియమించారు. థర్డ్ అంపైర్ లేదా టీవీ రీప్లేలను పరిశీలించే అఫిషియల్ ఎవరూ లేకపోవడంతో, ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సవాల్ చేసే (Refer) అవకాశం లేకుండా పోయింది. ప్రపంచ ఛాంపియన్ భారత్ ఆడుతున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ లేకపోవడం, అంపైర్ల చేసిన తప్పదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.