దూబేని వదిలేస్తే మాన్స్టర్ అయితడు.. CSKకి బిగ్ డెంజర్: హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై అశ్విన్ హాట్ కామెంట్స్!

దూబేని వదిలేస్తే మాన్స్టర్ అయితడు.. CSKకి బిగ్ డెంజర్: హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై అశ్విన్ హాట్ కామెంట్స్!

Hardik Pandya Trade: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యానికి భారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక రేంజ్‌లో హెచ్చరికలు జారీ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సీఎస్‌కేలోకి తీసుకునే క్రమంలో పవర్ హిట్టర్ శివమ్ దూబేను వేరే టీమ్‌కి ట్రేడ్ చేస్తారనే ప్రచారానికి అశ్విన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దూబేను గనుక సీఎస్‌కే వీడితే అతనొక మాన్స్టర్ గా మారతాడని, వేరే టీమ్‌లో ఊచకోత కోస్తాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో దూబే ప్రదర్శన కాస్త నిరాశాజనకంగానే సాగింది. 9 ఇన్నింగ్స్‌లలో కేవలం 203 రన్స్ మాత్రమే చేసి, ఫీల్డింగ్‌లోనూ కొన్ని క్యాచ్‌లు వదిలేశాడు. అయినా సరే, భారీ సిక్సర్లు కొట్టగల సత్తా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ పవర్ హిట్టింగ్ ఉన్న దూబే వంటి ప్లేయర్లు ఇండియాలో చాలా అరుదుగా దొరుకుతారు.. అతన్ని వదులుకుంటే చెన్నైకి కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆర్ అశ్విన్ స్పష్టం చేశాడు. 

హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. సీఎస్‌కే బ్యాక్‌ఫైర్ అవుతుంది: 

హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తే.. శివమ్ దూబేతో పాటు పేసర్లు ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్‌లను కూడా కోల్పోవాల్సి వస్తుందని రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించాడు. గతేడాదే ఖలీల్ అహ్మద్ టీమ్ నుంచి రిలీజ్ కోరినట్లు వార్తలు వచ్చాయని, ఇలాంటి విజ్ఞప్తులను ఫ్రాంచైజీలు కాదనలేవని గుర్తు చేశాడు.

ముంబై మైండ్ గేమ్‌: ముంబై ఇండియన్స్ తన వెన్నుముక దెబ్బతింటున్నప్పుడు, సీఎస్‌కే బ్యాక్‌బోన్ (Backbone) కూడా విరిచేందుకే చూస్తుంది. హార్దిక్ రాకతో సీఎస్‌కే మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్ బలపడొచ్చు కానీ, దూబే, ఖలీల్, కంబోజ్‌లను ఇచ్చేస్తే ఇండియన్ పేస్ విభాగం పూర్తిగా ఖాళీ అవుతుందన్నాడు.  వీరు లేకపోతే అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్‌లపైనే చెన్నై బౌలింగ్ భారం పడుతుందని, ఇది జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందని హెచ్చరించాడు.

ALSO READ : ధోనీ క్లాస్ vs రోహిత్ మాస్: భారత్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరు?.. 

సీఎస్‌కే టార్గెట్ చేయాల్సిన బౌలర్లు వీళ్లే: 

ఒకవేళ కోర్ ఇండియన్ ప్లేయర్లను ఇచ్చి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకుంటే, బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఆటగాళ్లను కొనుగోలు చేయాలో కూడా అశ్విన్ సూచించాడు. చెపాక్ స్టేడియం పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది కాబట్టి జోష్ టాంగ్ (Josh Tongue), సన్నీ బేకర్ (Sonny Baker), నాథన్ ఎల్లిస్ (Nathan Ellis) లాంటి విదేశీ పేసర్లను టార్గెట్ చేయాలని సూచించాడు. అలాగే క్వాలిటీ ఉన్న ఒక భారతీయ స్పిన్నర్ కోసం సీఎస్‌కే గట్టిగా ప్రయత్నించాలని, ముఖ్యంగా సాయి కిషోర్ (Sai Kishore) కోసం ఆల్-అవుట్ వెళ్లాలని అశ్విన్ సలహా ఇచ్చాడు.