తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు (మార్చ్ 20) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం అనేది వారి ఆత్మ గౌరవానికి చిహ్నం. దీనిని గుర్తించి ప్రభుత్వం “ఇందిరమ్మ ఇండ్లు" అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కోసం పేద కుటుంబాలకు వారి సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపారూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనుంది.
ALSO READ : చౌటుప్పల్, మహేశ్వరంలో EV బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్లు
ఈ పథకం కింద ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇళ్లను మంజూరు చేయగా... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి ఈ ఇండ్లు కేటాయించబడతాయి. గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ, ప్రతి నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇండ్లు కేటాయించారు. ఈ పథకానికి 22 వేల 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 5 వేల 73 కోట్ల 84 లక్షలు ఖర్చు చేశారు.
