పొల్యుషన్ తగ్గించడంతో పాటు.. గ్రీన్ తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ బడ్జెట్ 2026–27 లో భాగంగా రెనెవబుల్ ఎనర్జీ వినియోగంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం EV బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చౌటుప్పల్, మహేశ్వరంలో EV బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
పునరుత్పాదక శక్తి రంగంలో ముందంజలో ఉన్న తెలంగాణ.. సౌర ప్రాజెక్టులు, సోలార్ విలేజ్లు, రూఢాప్ విస్తరణ మాత్రమే కాకుండా.. PM KUSUM పథకం ద్వారా రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇది రైతును వ్యవసాయకర్తగా మాత్రమే కాకుండా శక్తి రంగంలో భాగస్వామిగా నిలబెడుతుందన్నారు. ఇప్పుడు శక్తి రంగం భవిష్యత్తు గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
ALSO READ : కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు : రూ.500 కోట్లు కేటాయింపు
శక్తిని ఉత్పత్తి చేయడం ఒక దశ, దాన్ని నిల్వ చేసి సమర్ధవంతంగా వినియోగించడం భవిష్యత్తు అని అన్నారు. ఈ దిశగా మహేశ్వరం మరియు చౌటుప్పల్లో 1500 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే TGGENCO హైడల్ ఉత్పత్తిలో రికార్డు సాధించి లక్ష్యాన్ని దాదాపు రెట్టింపు చేసినట్లు తెలిపారు.
