IPL 2026: త్వరలోనే ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో ఆరంభ మ్యాచులకి దూరం కాగా మరో ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ పాదానికి గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు ఈరోజు ( మార్చి 20న) ప్రకటించాడు. ఎడ్వర్డ్స్‌ను వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఎడ్వర్డ్స్ బిగ్ బాష్ లీగ్ (BBL) 2025–-26 ఎడిషన్‌లో అద్భుతంగా రాణించాడు. అతను సిడ్నీ సిక్సర్స్ తరఫున 13 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టి, 133 పరుగులు చేశాడు. అప్పటి నుంచి అతడు తన స్టేట్ టీమ్ అయిన న్యూ సౌత్ వేల్స్ తరఫున రెండు షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లు ఆడాడు, వాటిలో చివరి మ్యాచ్ గురువారం నాడు ముగిసింది.
SRH రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నముక్క గాయానికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ సీజన్ ప్రారంభ మ్యాచులకి అతడు దూరంగా ఉండనున్నాడు. ఇషాన్ కిషాన్ జట్టు నాయకత్వం వహిస్తారు, అభిషేక్ శర్మ అతడికి డిప్యూటీగా ఉండనున్నారని ఫ్రాంచైజీ పేర్కొనింది. గాయాల నుంచి తప్పుకుంటున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఎడ్వర్డ్స్ కూడా చేరాడు. కమిన్స్‌తో పాటు, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ కూడా గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. ఇదిలా ఉండగా, బీసీసీఐ ఐపీఎల్ 2026 ఎడిషన్ మొదటి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మార్చి 28వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచుతో ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభమవుతుంది.
SRH IPL 2026 స్క్వాడ్:
బ్యాట్స్‌మెన్:
ఇషాన్ కిషాన్, అనికేత్ వర్మ, సమరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెయిన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్స్
ALSO READ : క్రికెట్‌పై ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం సెగ.. ఇంగ్లాండ్లో బంతుల కొరత
ఆల్‌రౌండర్స్:
హర్షల్ పటేల్, కమిందు మేందిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్, శివాంగ్ కుమార్, క్రైన్ ఫులెట్రా, లియం లివింగ్స్‌టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి
బౌలర్స్:
పాట్ కమిన్స్, జీషాన్ అంసారీ, జయదేవ్ ఊనడ్కట్, ఇశాన్ మాలింగా, సకిబ్ హుస్సేన్, ఒంకర్ తర్మాలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింజే, శివం మావీ
