హైదరాబాద్: మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్ పేట్-రాయదుర్గం మార్గంలో.. జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో.. రెండు వైపులా రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 12 నిమిషాలు జూబ్లీ చెక్ పోస్ట్ స్టేషన్లో మెట్రో ట్రైన్స్ నిలిచిపోయాయి. తిరిగి ట్రైన్ ఆపరేషన్స్ యదావిధిగా నడుస్తున్నాయి.
రైలు నిలిచిపోవడంతో మైట్రోరైళ్ల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం నెలకొంది. దీంతో కొన్ని మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉన్నారు. ఆ తర్వాత సమస్య క్లియర్ చేయడంతో యధావిధిగా మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. ఆలస్యం కావడంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
