న్యూజిలాండ్ తో టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్ కు సిద్దమవుతోంది. బుధవారం (జనవరి 28) ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 జరగనుంది. తొలి మూడు టీ20ల్లో తిరుగులేని విజయాలను అందుకున్న భారత జట్టు చివరి రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ నాలుగో టీ20లో ఇండియాకు షాక్ ఇచ్చి ఎలాగైనా బోణీ కొట్టాలని కసరత్తులు చేస్తుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా 3-0 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో టీ20 బుధవారం (జనవరి 28) సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.
నాలుగో టీ20లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు నాలుగో టీ 20లో రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. పాండ్య బెంచ్ కు పరిమితమైతే స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ ఉంది. శ్రేయాస్ అయ్యర్ రూపంలో బ్యాటింగ్ ఆప్షన్ ఉన్నప్పటికీ అయ్యర్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేకపోవడంతో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. నాలుగో టీ20 ఆడే స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా నాలుగో టీ20లో పని భారం కారణంగా రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా స్థానంలో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నాడు.
అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో ఆడతాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీంతో శివమ్ దూబే ఐదో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆరో స్థానంలో రింకూ సింగ్.. ఏడో స్థానంలో హర్షిత్ రానాకి ఛాన్స్ దక్కొచ్చు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు.
న్యూజిలాండ్ తో నాలుగో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):
అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్
