వివాదాలకు కేరాఫ్ గా పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్.. పోలీసులు సీజ్ చేస్తారా.?

వివాదాలకు కేరాఫ్ గా పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్.. పోలీసులు సీజ్ చేస్తారా.?

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు డీల్ ఇదే ఫామ్ హౌస్ లో జరిగింది. గతంలో రెండు సార్లు  ఈ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడులు కూడా జరిగాయి. మరోసారి  నిన్న (మార్చి 14) రాత్రి డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు కావడంతో ఈ ఫామ్ హౌస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇల్లీగల్ కార్యక్రమాలకు  అడ్డగా మారుతోన్న ఈ ఫామ్ హౌస్ పై సీపీ యాక్ట్ నమోదు చేసి  సీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. 

మార్చి 14న రాత్రి మొయినా బాద్ లోని  రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు చేశారు. రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వీకెండ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు పార్టీలో డ్రగ్స్ ను  గుర్తించారు. విదేశీ మద్యం బాటిళ్లు, గన్,  డ్రగ్స్ ను సీజ్ చేశారు.  డ్రగ్స్ పార్టీపై కేసు నమోదు చేసిన పోలీసులు  మొత్తం పార్టీకి అటెండైన 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు  తెలిపారు పోలీసులు.  వీరిలో  తిరువీడుల అర్జున్ రెడ్డి, కౌషిక్ రవి,  రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, పంజుగుల రోహిత్ రెడ్డి, టిడిపి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. 

ఈగల్ ఫోర్స్ SP గిరిధర్ మాట్లాడుతూ... మార్చి 14న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో మొయినాబాద్ లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ లో డ్రగ్స్ పట్టుకున్నాం .  పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఇందులో మొత్తం 11 మందిని గుర్తించాం.  ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మరో ఆరుగురికి నెగిటివ్ వచ్చింది.  టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మేము వెళ్లేసరికి వాళ్ళు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. రివాల్వర్ ఢిల్లీ కి చెందిన నిమిష్ శర్మదిగా గుర్తించాం . డ్రగ్స్ తీసుకున్న మత్తులో కాల్పులు జరిపారని గుర్తించాం . 11 మందిని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నాం . దర్యాప్తు కొనసాగుతోంది, దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు బయటికొస్తాయని వెల్లడించారు.