SL vs ENG: వన్డేల్లోనూ వీరవిహారం.. 14 బంతుల్లోనే 51 పరుగులతో దుమ్ములేపిన ఇంగ్లాండ్ క్రికెటర్

SL vs ENG: వన్డేల్లోనూ వీరవిహారం.. 14 బంతుల్లోనే 51 పరుగులతో దుమ్ములేపిన ఇంగ్లాండ్ క్రికెటర్

శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో దుమ్ములేపింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ యువ బ్యాటర్.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీతో రెచ్చిపోయి ఆడాడు. మంగళవారం (జనవరి 27) కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో బ్రూక్ కేవలం 66 బంతుల్లోనే 136 పరుగులు చేసి వీర విహారం చేశాడు. బ్రూక్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లతో పాటు 9 సిక్సర్లున్నాయి. బ్రూక్ తో పాటు రూట్ (111) కూడాసెంచరీతో దుమ్ములేపడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. బ్రూక్, రూట్ నాలుగో వికెట్ కు అజేయంగా 191 పరుగులు జోడించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది.   

నిర్ణయాత్మక మూడో వన్డేలో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు విఫలం కావడంతో ఇంగ్లాండ్ 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జాకబ్ బెతేల్, సీనియర్ ప్లేయర్ జో రూట్ భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. మూడో వికెట్ కు 126 పరుగులు జోడించి జట్టును ముందుకు తీసుకెళ్లారు. ఈక్రమంలో రూట్ తో పాటు బెతేల్ (65) తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ తర్వాత బెతేల్ (65) ఔటయ్యాడు. అయితే అసలైన విధ్వంసం ఇక్కడ నుంచే మొదలవుతుందని శ్రీలంక ఊహించి ఉండదేమో. కెప్టెన్ బ్రూక్ రూపంలో శ్రీలంక బౌలర్లను కష్టాలు వచ్చాయి. 

ఆరంభంలో రూట్ తో కలిసి ఒక మాదిరిగా ఆడిన బ్రూక్ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత బ్రూక్ విశ్వరూపం చూపించాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ చేరుకోవడానికి కేవలం 17 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇక బ్రూక్ తాను ఎదర్కొన్న చివరి 14 బంతుల్లో ఏకంగా 51 పరుగులు కొట్టాడంటే అతని విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. బ్రూక్ విధ్వంసం ధాటికి ఇంగ్లాండ్ చివరి ఐదు ఓవర్లలో 88 పరుగులు చేసింది. బ్రూక్ తో పాటు రూట్ కూడా తన సెంచరీ పూర్తి చేసుకొని జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.