ఢిల్లీ: బీజేపీ ఎంత కొట్లాడినా తెలంగాణలో అధికారంలోకి రాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కర్ణాటక, తెలంగాణ లో బీజేపీ లేదన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ అక్కడ ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా. డుతూ బీజేపీతో పాటు బీఆర్ఎ ఎస్ పని కూడా అయిపోయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్మా ణంపై స్పందిస్తూ ఇంకా 2 డీసీసీ ప్రెసిడెంట్లు, మహిళా అధ్యక్షురాలి ఎంపిక పెండింగ్లో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబా ద్లో బీఆర్ఎస్ లేదన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందన్నారు.
కవిత సొంత పార్టీ పెట్టి పోటీ చేసే ఆలోచనలో ఉన్నదన్నారు.నైనీ కోల్ బ్లాక్ పంచాయతీ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ వద్ద ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
