IPL 2026: చెన్నై ఫ్యాన్స్కు పండగే.. ఐపీఎల్కు ముదు స్పెషల్ ఫ్యాన్ ఈవెంట్ ROAR'2026

IPL 2026: చెన్నై ఫ్యాన్స్కు పండగే.. ఐపీఎల్కు ముదు స్పెషల్ ఫ్యాన్ ఈవెంట్ ROAR'2026

ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఐపీఎల్ వస్తుందంటే ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చినట్లే ఉంటుంది. ముఖ్యంగా ధోనీ కోసం స్టేడియానికి పరుగులు తీస్తుంటారు అభిమానులు. 2025 లో నిరాశ పరిచిన చెన్నై.. 2026 లో ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ తో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

ఐపీఎల్ కు ముందే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. చెన్నై లో మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. చెన్నై చిదంబరం స్టేడియంలో మార్చి 22 న రోర్-2026 (ROAR'2026) పేరున పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తోంది. 

సీఎస్కే క్లబ్, దాని సపోర్టర్స్ జర్నీని సెలబ్రేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. చెన్నై సీనియర్ ప్లేయర్స్ అయిన సురేష్ రైనా, మాథ్యూ హెడెన్, మురిళీ విజయ్, బద్రినాథ్ మొదలైన సీనియర్స్ రీయూనియన్ అవుతున్నట్లు పేర్కొంది. హస్సీ నుంచి హెడెన్, రైనా నుంచి ధోనీ వరకు స్టార్స్ ప్లేయర్స్ ను చూడవచ్చునని పేర్కొంది.  ఎగ్జిబిషన్ మ్యాచ్ లో భాగంగా వీళ్లందరూ స్కాడ్ లో ఉంటారని ప్రకటించింది. దీనిక అదనంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ కూడా ఉంటుందని అనౌన్స్ చేసింది. 

►ALSO READ | Sanju Samson: మేము ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్: అభిషేక్తో పాట్నర్షిప్పై సంజూ శాంసన్

మార్చి 15 ఉదయం 11 గంటలకు నుంచి  CSK యాప్ లో టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ఫ్రాంఛైజీ అఫీషియల్ వెబ్ సైట్,  డిస్ట్రిక్ట్ యాప్, వెబ్ సైట్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది. కేవలం అఫీషియల్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే టికెట్లు కొనాలని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేసింది. 

CSK రోర్' 26 దేని గురించి?

RCB అన్‌బాక్సింగ్ ఈవెంట్ లాగానే, CSK రోర్' 26 కూడా ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాళ్లను కలిసి చూడటానికి, ఎంజాయ్ చేయటానికి ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రాం. ప్రస్తుత ఆటగాళ్లందరూ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. అంతేకాకుండా, AR రెహమాన్ అదే రోజు స్టేడియంలో లైవ్ పర్ఫామెన్స్ ఇస్తాడు. ఫ్యాన్స్ కు మార్చి 22 బెస్ట్ మెమరబుల్ డే లాగా ఉంటుందని చెబుతున్నారు.