ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి: మంత్రి తుమ్మల

ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ.. రైతులు  ధైర్యంగా ఆయిల్ పామ్ సాగు చేయండి: మంత్రి తుమ్మల

రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ సాగుచేయాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.  రైతులు క్రాప్ డైవర్షన్ వైపు  మారాలని లేకపోతే  రైతులకు నష్టం జరుగుతుందన్నారు .  సిద్దిపేట జిల్లా నర్మేటట్టలో మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి పొన్నంతో కలిసి సందర్శించారు. 

ఈ సందర్భంగా  మాట్లాడిన మంత్రి తుమ్మల.. ‘తెలంగాణకు సిద్దిపేట కేంద్రంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టాం. ఇక్కడ రూ. 40 కోట్లతో  రిఫైనరీ ఆయిల్ యూనిట్ కూడా ప్రారంభిస్తాం. రైతులు పండించిన వేస్టెజ్ గెలలతో విద్యుత్ తయారు చేస్తాం. కేంద్రం  వరి ధాన్యం కొనబోమని చెబుతోంది.రబీలో కూడా అత్యధికంగా మనమే వరి పండిస్తున్నాం.  రైతులకు కాంగ్రెస్  ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ఎక్కువ సాగు చేస్తున్నారు.  నా వరి పొలంలో కూడా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నా.  ఇక్కడ ఉన్న బాలకృష్ణ దళిత రైతు ధైర్యంతో ఆయిల్ పామ్ సాగు చేసి లాభాలు పొందుతున్నారు.  ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి... సాగు కావాల్సిన అన్ని సబ్సిడీ ప్రభుత్వం మీకు ఇస్తుంది.  నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రూ. 12 వేలకు టన్ను ఉంటే... కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఇప్పుడు  రూ.21 వేలకు టన్ను చేశాం.  రైతులను కష్టాల నుంచి తప్పించాలన్న.. గ్రామాలు పచ్చగా ఉండాలన్నా  హార్టికల్చర్ క్రాప్స్ వేయాలి.  నేను నా సొంత పొలంలో వక్క సాగు చేస్తున్న... ఆయిల్ పామ్ సాగులో ఇంటర్ క్రాప్ పంటలకు కూడా సబ్సిడీ ఇస్తాం. 30 జిల్లాలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ జరుగుతుంది . రైతులకు ఎలాంటి ఇబ్బంది లేని పంట పామ్ ఆయిల్ . తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులను ఇక్కడికి పిలుస్తాం. వారికి కావాల్సిన స్టాల్స్ అన్ని పెడతాం’ అని అన్నారు.

►ALSO  READ | మీ ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు..బుక్ చేసుకోండి ఇలా...

ప్రతి జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ: మంత్రి  పొన్నం

ఈ మధ్య గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతుంది..అక్కడ అమూల్ పాలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయి.  ఇక్కడ ఆయిల్ పామ్ ఆయిల్  తుమ్మల నాగేశ్వరరావు స్టార్ట్ చేశారు.. ప్రతి జిల్లాలకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని బావిస్తున్నాం.  ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గతంలో ప్రతిపాదనలు జరిగినప్పటికీ 300 కోట్లు కేటాయించి తుమ్మల నాగేశ్వరరావు పనులు పూర్తి చేయించారు.  ఈ  ప్రాంత రైతాంగానికి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఈ ప్రాంత రైతులు ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలి..మా ప్రాంతంలో ఆయిల్ ఫామ్ పంట పండదు అనే అపోహ నుండి తుమ్మల బయటకు తీసుకొచ్చారు. ఇక్కడి రైతులు ఆయిల్ ఫామ్ పై ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా  రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలనీ ఈ ప్రాంత రైతులను కోరుతున్నా  అని పొన్నం అన్నారు.