ఈ వారం క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం రేట్లు వీకెండ్ రోజున కూడా అదే జోరును కొనసాగించాయి. ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్యంపై కొనసాగుతున్న యుద్ధ ప్రభావం రేట్ల పతనానికి కారణంగా చెబుతున్నారు బులియన్ వ్యాపారులు. ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్న రిటైల్ కొనుగోలుదారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తగ్గిన ధరలను పరిశీలించండి మీ నగరాల్లో.
మార్చి 14న బంగారం రేట్లు తగ్గాయి. మార్చి 13 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.103 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 966గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 635గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 14, 2026న దేశవ్యాప్తంగా తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 80వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.280 వద్ద ఉంది.
