మున్సిపల్ ఎన్నికల్లో జనవరి 28 నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఫిబ్రవరి 3 వరకు విత్ డ్రాలు నిర్వహించి అదే రోజు గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే ఫిబ్రవరి 9వ తేదీన ప్రచారం బంద్ అవుతుంది. ఈ లెక్కన అభ్యర్థులు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది.
52 లక్షల ఓటర్లు
ఫిబ్రవరి 11న పోలింగ్..13న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళలు 26.80 లక్షలు, పురుషులు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
