భారీగా పెరుగుతూ పోతున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు రోజురోజుకూ ఊహించని ధరలకు చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు లోహాలు అంతర్జాతీయంగానే కాకుండా రిటైల్ మార్కెట్లలో కూడా సరికొత్త రికార్డు గరిష్టాలను తాకాయి. దీంతో ఒక్క నెలలోనే ఇంత ర్యాలీని చూసిన సామాన్య మధ్యతరగతి భారతీయులు రానున్న కాలంలో పరిస్థితి ఏంటో అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మెుత్తానికి అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ కొనసాగే మరో మూడేళ్ల పాటు ఇదే పరిస్థితులు ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. రేట్లు ఎంతఉన్నా షాపింగ్ చేసేవారు పెరుగుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని తాజా రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం చాలా మందిచి.
జనవరి 27న బంగారం రేట్లు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.76 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.16వేల 195గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 845గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
బంగారం విషయాన్ని పక్కన పెడితే సిల్వర్ మాత్రం చుక్కల్లో చంద్రుడిలా అందనంత దూరారిని చేరిపోతోంది రోజురోజుకూ ర్యాలీతో. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. మంగళవారం జనవరి 27, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగింది దేశీయంగా. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 87వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.387 వద్ద ఉంది.
