గ్యాస్ సిలిండర్లు మీరే తెచ్చుకోవాలి.. భోజనాలు వండుతాం.. పెళ్లి క్యాటరింగ్ సర్వీస్ కొత్త రూల్

గ్యాస్ సిలిండర్లు మీరే తెచ్చుకోవాలి.. భోజనాలు వండుతాం.. పెళ్లి క్యాటరింగ్ సర్వీస్ కొత్త రూల్

పెళ్లి అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది భోజనాలు.. పెళ్లి వేడుక ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్.. మధ్య మధ్యలో స్నాక్స్ ఇలా బోలెడు ఫుడ్ వండాల్సి వస్తుంది. పెళ్లి వేడుకలో మెజార్టీ ఖర్చు ఈ ఫుడ్ కే అన్నదే తెలిసిందే.. 

దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఉన్న క్రమంలో.. చత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా పరిస్థితికి అద్దం పడుతోంది. చత్తీస్ ఘడ్ రాష్ట్రం అంబికాపూర్ లోని ఓ హోటల్ లో పెళ్లి వేడుకకు ప్లాన్ చేసుకున్నది ఓ కుటుంబం. మూడు రోజుల వేడుక. హల్దీ, పెళ్లి, రిసెప్షన్. మూడు రోజులకు 3 వేల మంది వస్తారని అంచనాతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది కుటుంబం. ఈలోపు గ్యాస్ సంక్షోభం వచ్చింది. గ్యాస్ కొరత కారణంగా హోటల్ నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. 

ఇప్పటికిప్పుడు అన్ని గ్యాస్ సిలిండర్లు దొరకటం కష్టం అని డిసైడ్ అయ్యారు.పెళ్లి వాళ్లకు కబురు పెట్టారు. గ్యాస్ కొరత ఉంది.. మాకు గ్యాస్ సిలిండర్లు దొరకటం లేదు.. మీరు గ్యాస్ సిలిండర్లు తెచ్చుకుంటే.. మేం ఫుడ్ వండి పెడతాం.. లేదంటే లేదు. గ్యాస్ సిలిండర్లు మాకు దొరకటం లేదు.. గ్యాస్ సిలిండర్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత మీదే.. అలా అయితే మా హోటల్ లో పెళ్లి వేడుక చేసుకోండి అని తేల్చి చెప్పింది. లేదంటే పెళ్లి వేడుక మా దగ్గర పెట్టుకోండి.. ఫుడ్ అంతా బయట తెచ్చుకోండి.. మేం మాత్రం గ్యాస్ లేకుండా మీ మెనూకు తగ్గట్టు వండి పెట్టలేం అని స్పష్టం చేసింది హోటల్ యాజమాన్యం.

దీంతో పెళ్లి వేడుకపై డైలమా ఏర్పడింది. ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పెళ్లి వేడుకలపై గ్యాస్ కష్టాలకు ఇదో ఉదాహరణ.