'డీజే టిల్లు'గా తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నటుడు సిద్దు జొన్నలగడ్డ. స్టార్ బాయ్ గా యూత్ లో వీపరితమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'తెలుసు కదా' మూవీపై ఆశలు పెట్టుకున్నా.. ఆశించిన స్థాయిలో మెప్పించినలేపోయారు. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో తన లైనప్ ను పూర్తిగా మార్చేసి .. మూడు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
క్రేజీ ప్రాజెక్టు
అంతే కాకుండా తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సిద్ధు. కేవలం కామెడీకే పరిమితం కాకుండా విభిన్న జానర్లలో తనను ఫ్రూవ్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జేతో సిద్ధు చేతులు కలిపారు. ఈ సినిమాకు 'రాంబో' (Rambo) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో సిద్ధు ఒక బ్రాహ్మణ యువకుడిగా, ఆపై డిటెక్టివ్‌గా మారే ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రైమ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది.
సోషియో ఫాంటసీతో ప్రయోగం..
సిద్ధు కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని సరికొత్త జానర్ సోషియో ఫాంటసీ మూవీ రెడీ అయ్యారు.. ఒక డెబ్యూ డైరెక్టర్ చెప్పిన 'అవుట్ ఆఫ్ ది బాక్స్' పాయింట్ సిద్ధుకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. గ్రాఫిక్స్, విజువల్ వండర్‌గా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వీటితో పాటు ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరితో సిద్ధు ఒక భారీ ప్రాజెక్ట్ లాక్ చేశారు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ సినిమా సిద్ధు మార్కెట్‌ను మరింత పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సిద్ధు రవికాంత్ పేరేపు దర్శకత్వంలో 'బాడాస్' (Badass) అనే ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాలో కూడా నటిస్తున్నారు. 'కృష్ణ అండ్ హిస్ లీలా' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రం సిద్ధులోని మరో కోణాన్ని ఆవిష్కరించనుంది. అలాగే 'టిల్లు క్యూబ్' పనులు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతున్నాయి. మొత్తానికి, 'తెలుసు కదా' ఫలితాన్ని పక్కన పెట్టి, సిద్ధు ఒక పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ మూడు వైవిధ్యమైన కథలతో సిద్ధు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..
