యాదాద్రి భువనగిరి జిల్లాలో అవినీతి అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. ఒక ఉద్యోగికి జీతం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మోత్కూర్ STO కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ ఖాదిర్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
ఏసీబీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. మోత్కూర్ STO కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి 38 రోజుల వేతనం ఇవ్వటం కోసం 10 వేల రూపాయలు డిమాండ్ చేశాడు సీనియర్ అసిస్టెంట్ ఖాదిర్. బాధితుడి ఫిర్యాదు మేరకు భువనగిరిలోని ఖాదిర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు అధికారులు.
తొలుత 5 వేల రూపాయలు తన సహచర ఉద్యోగి కి ఫోన్ పే చేయించుకున్నాడు ఖదీర్. మరో రెండో విడత 5 వేలు కోసం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డబ్బులు తీసుకుంటడగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
