అల్వాల్ మచ్చ బొల్లారంలోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

అల్వాల్ మచ్చ బొల్లారంలోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: అల్వార్ మచ్చ బొల్లారంలోని స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ దుకాణం పక్కనే మంటలు చెలరేగి స్క్రాప్ దుకాణంలో ఉన్న కాగితాలకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్క్రాప్ దుకాణంలో ఉన్న కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో స్క్రాప్ దుకాణంలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ దుకాణాన్ని నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. గతంలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్కి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. జనావాస ప్రాంతాలలో స్క్రాప్ గోదాములను తొలగించాలని డిమాండ్ చేశారు.