మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ 'దేవర'. 2024, సెప్టెంబర్ 27 రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సృష్టించిన రికార్డులు తెలిసిందే. అయితే ఈ సినిమా ముగింపులో పార్ 2 ఉంటుందని హింట్ ఇచ్చి.. మరింత ఆసక్తిని పెంచారు. కానీ గత కొన్ని నెలలుగా ఈ సీక్విల్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. తారక్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో కొరటాల వేరే హీరోల వైపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు రావడంతో అభిమానలను ఆందోళనకు గురిచేసింది. అయితే వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ.. నిర్మాత నుంచి కీలకమైన అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
'దేవర2' షూటింగ్ ఎప్పుడుంటే?
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సుధాకర్ మిక్కిలినేని 'దేవర-2పై ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కొట్టిపారేస్తూ, "దేవర-2' ఖచ్చితంగా ఉంది. ఈ ఏడాది మే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని 2027 ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వార్తతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది.
నీల్ సినిమా తర్వాతే రాక..
ప్రస్తుతం ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో తారక్ చేస్తున్న డ్రాగన్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా మే నాటికి మేజర్ పార్ట్ పూర్తి కానుందని సమాచారం. ఆ వెంటనే తారక్ తిరిగి 'దేవర2' ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. కొరటాల శివ ఇప్పటికే పార్ట్-2 స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్ ఎలిమెంట్స్‌తో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
భారీ అంచనాలతో..
మొదటి భాగంలో దేవర పాత్ర మరణం వెనుక ఉన్న రహస్యం, వర పాత్రలో ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సముద్రతీర గ్రామాల్లో దేవర వేసిన ముద్ర, అతని శత్రువుల తదుపరి ఎత్తుగడలు పార్ట్-2 లో కీలకం కానున్నాయి. మొదటి భాగంపై వచ్చిన చిన్నపాటి విమర్శలను దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ కసరత్తులు చేస్తున్నారు. ' దేవర-1' లోని "సముద్రం రక్తంతో తడిచింది.. ఇప్పుడు ఆ రక్తం ఎవరిదో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది" అనే క్లైమాక్స్ థ్రెడ్‌నే పార్ట్-2 లో మెయిన్ హైలైట్‌గా చూపించబోతున్నారు. ఈ మూవీపై వస్తున్న వదంతులకు స్వస్తి పలుకుతూ నిర్మాత స్వయంగా డేట్లు ప్రకటించడంతో, ఇక 'దేవర' వేట మొదలైనట్టేనని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. 2027లో బాక్సాఫీస్ వద్ద మరోసారి ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించడం ఖాయం అంటున్నారు..
#DEVARA 2 Update 🚨🚨
— Milagro Movies (@MilagroMovies) January 27, 2026
• Shoot begins from May 2026
• Release planned for 2027
:- Producer #SudhakarMikkilineni#NTRpic.twitter.com/IDmpz5bVWD
