టెహ్రాన్: ఇరాన్ అగ్రనేతల మరణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ, ఇరాన్ నేషనల్ సెక్యూటీరి కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ వంటి టాప్ లీడర్స్‌ను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. లేటేస్ట్‌గా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది.
మంగళవారం (మార్చి 17) రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. తమ లక్ష్యంగా ఉన్న ఏ ఇరాన్ అధికారినైనా హతమార్చేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చారని చెప్పారు. అయితే, ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.
ఇస్మాయిల్ ఖతీబ్ ఎవరంటే..?
ఇస్మాయిల్ ఖతీబ్ ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లోని ఘయెనాట్‌లో జన్మించారు. ఆయన ఒక షియా మత గురువు. ఇరాన్ న్యాయవ్యవస్థలో, ఇంటలిజెన్స్ మంత్రిత్వ శాఖలో వివిధ పదవుల్లో పని చేశారు. 1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో రివల్యూషనరీ గార్డ్‌లో కూడా ఇస్మాయిల్ ఖతీబ్ పాల్గొన్నారు. 2022లో యూఎస్ ట్రెజరీ ఇస్మాయిల్ ఖతీబ్‌పై ఆంక్షలు విధించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అత్యంత నమ్మకస్తుల్లో ఇస్మాయిల్ ఖతీబ్ ఒకరు. ఇందులో భాగంగానే ఎంతో కీలకమైన ఇంటలిజెన్స్ శాఖ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
►ALSO READ | మా 22 ఏళ్ల కష్టాన్ని క్షణంలో కూల్చేశారు : ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలిన అపార్ట్మెంట్..!
