పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవితాలపై పడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న ఫుడ్ కోర్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అనేక చోట్ల ప్రత్యామ్నాయ వంట పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి రైలు లోపల ఆవు పేడ పిడకలను అమ్ముతూ కనిపిస్తాడు. ఇది మొదట చూడటానికి హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైన సమస్యను ఇది చూపిస్తుంది. @Prajapat204 అనే ఖాతా ద్వారా X సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేసిన ఈ వైరల్ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది చూశారు. వేలాది మంది లైక్ చేశారు.
వైరల్ వీడియోలో ..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి రైలు కంపార్ట్‌మెంట్‌లో తిరుగుతూ ఆవు పేడ పిడకలు అమ్ముతూ కనిపిస్తాడు. అతను ప్రయాణికులను ఆవు పేడ పిడకలు కావాలా అని గట్టిగా అడుగుతాడు. ఇది మొదట ప్రజలను ఆశ్చర్యపరిచినా ఆ తర్వాత నవ్వుకునేలా చేసింది.
►ALSO READ | గ్యాస్ కష్టాలు ఉన్నాయి.. PNGకి మారితే 10 శాతం అదనంగా కమర్షియల్ గ్యాస్ ఇస్తాం : కేంద్రం
ఆ వీడియోలో అతను ఒక మహిళతో కూడా మాట్లాడుతూ అతను ఆమెను గ్యాస్ దొరుకుతుందా అని అడగ్గా, గ్యాస్ దొరుకుతుంది కానీ చాలా సమయం పడుతుందని ఆమె బదులిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి, ఇతరులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకే, అత్యవసర పరిస్థితుల కోసం తాను ఆవు పేడ పిడకలను అమ్ముతున్నానని చెప్పాడు. ఇది విన్న రైలులోని చాలా మంది ప్రయాణికులు పగలబడి నవ్వారు. కొందరు దానిని ఒక జోక్‌గా భావిస్తే మరికొందరు దానిని ప్రస్తుత పరిస్థితిని వ్యంగ్యంగా చూశారు.
సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ అయిన వెంటనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు దాన్ని కామెడీగా తీసుకున్నారు. భారత్ లో ఏదైనా జరిగేందుకు సాధ్యమే అన్నారు. మరికొందరు ఎల్పీజీ కొరతను ఇలా వ్యంగ్యంగా పరిగణించారు. వీడియో ఎంటర్ టైన్ చేసినప్పటికీ గ్యాస్ కొరత వంటి సమస్యలు సామాన్య ప్రజలను ఎంతగా కుంగ దీయగలవో అది వివరిస్తుందని చాలా మంది నెటిజన్లు రాశారు.
भाई साहब, ट्रेन में उपले कौन बेचता है😂🤣
— Nitin Prajapati (@Prajapat204) March 16, 2026
INDIA के लोगों ने GAS त्रासदी को CONTENT के रूप में खूब इस्तेमाल किया है। pic.twitter.com/J2T7ndfoch
