దేశంలో ఎల్పీజీ నిల్వలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఇంకా కొనసాగుతోంది. పీఎన్ జీ,సీఎన్ జీ సప్లయ్ కి ఎలాంటి కొరత లేదన్న కేంద్రం.. ఎల్పీజీ కమర్షియల్ వినియోగదారులు PNG కనెక్షన్లకు మారితే మంచిదని సూచించింది. పీఎన్ జీ కనెక్షన్లు పెంచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. పీఎన్ జీని ప్రోత్సహించే రాష్ట్రాలకు అదనంగా 10శాతం కమర్షియల్ ఎల్పీజీ కేటాయిస్తామని పెట్రోలియంశాఖ తెలిపింది.
అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం,సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. ఎల్‌పిజి సమస్య ఇప్పటికీ ఆందోళనకరంగా ఉంది.గ్యాస్ ఏజెన్సీ దగ్గర పొడవైన క్యూలు ఉంటున్నాయన్నది కూడా వాస్తవం. అయితే ఆన్‌లైన్ బుకింగ్‌లో మెరుగుదల ఉందని చెప్పారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు 10 శాతం కమర్షియల్ గ్యాస్ ను కోటా పెంచుతున్నామన్నారు.
LPG నుంచి PNGకి మారేలా చర్యలు చేపడితే అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ వాణిజ్య LPG లో అదనంగా 10శాతం కేటాయింపు కేంద్రం అందిస్తుందని శర్మ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలవారిగా కమిటీలను ఏర్పాటు చేయడం, అనుమతులు మంజూరు,అద్దె ఛార్జీలను తగ్గించడం వంటి వాటికి నిర్దిష్ట కేటాయింపులు ఉంటాయని తెలిపింది.
►ALSO READ | గ్యాస్, క్రూడ్ కంటే భారీ సంక్షోభం ముంచుకొస్తోంది.. స్మార్ట్‌ఫోన్లు, కార్ల ధరలకు రెక్కలు?
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా గ్యాస్ రవాణా అంతరాయంతో ఎఫెక్ట్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం పడింది. ముఖ్యంగా ఫుడ్ సెక్టార్ మూతపడే పరిస్థితి ఏర్పడింది. దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు ,చిన్న తరహా పరిశ్రమలలో పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడం, పండుగలు, శుభకార్యాల సీజన్లలో తలెత్తే కృత్రిమ కొరతను నివారించడమే లక్ష్యంగా ఈ ఆఫర్ ఇచ్చింది.ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు HPCL, BPCL, IOCL ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా స్టాక్‌ను విడుదల చేస్తాయి.
